Breaking News

ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ కొడుకుకు ప్రతిష్టాత్మక అవార్డు

Published on Tue, 01/20/2026 - 16:11

ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ డారెన్‌ లెహ్‌మన్‌ కొడుకు జేక్‌ లెహ్‌మన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ 33 ఏళ్ల ఎడమ చేతి బ్యాటర్‌ను 2024-25 సీజన్‌కు గానూ మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జేక్‌ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయాక​ ఈ అవార్డు లభించింది.

ఆసీస్‌ దేశవాలీ క్రికెట్‌లో సుదీర్ఘంగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు రాకపోవడంతో జేక్‌ గత నెలలోనే తన బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఆధారంగా ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. అక్కడ అతను హ్యాంప్‌షైర్‌ కౌంటీతో లోకల్‌ ప్లేయర్‌ కేటగిరీలో రెండు సంవత్సరాల ఒప్పందం చేసుకున్నాడు. 

ఓ ఆటగాడు ఇతర దేశం తరఫున లోకల్‌ కేటగిరీలో అవకాశం దక్కించుకుంటే, తన సొంత దేశానికి ఆడే అర్హత కోల్పోతాడు. జేక్‌ విషయంలో ఇదే జరిగింది. జేక్‌ హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకోవడం​ వల్ల ఆస్ట్రేలియాకు ఆడాలన్న తన కలను చెరిపేసుకున్నాడు.

షెఫీల్డ్ షీల్డ్‌లో రికార్డు ప్రదర్శన  
జేక్ 2024-25 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో దక్షిణ ఆస్ట్రేలియా తరఫున రికార్డు ప్రదర్శన చేశాడు.  10 మ్యాచ్‌ల్లో నాలుగు వరుస సెంచరీల సాయంతో 44.11 సగటున 750 పరుగులు చేశాడు. ఆ సీజన్‌ ఫైనల్లో జేక్‌ చేసిన సెంచరీ దక్షిణ ఆస్ట్రేలియాకు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రెడ్‌బాల్ టైటిల్‌ను అందించింది.

తండ్రి వారసత్వం 
జేక్‌ తండ్రి డారెన్‌ లెహ్‌మన్‌ తన జమానాలో మూడుసార్లు డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు అతని కుమారుడు జేక్‌ కూడా ఆ అవార్డును తొలిసారి గెలుచుకుని తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాడు. ఈ అవార్డుకు ఎంపికైన తర్వాత జేక్ మాట్లాడుతూ .. ఇది నాకు షాక్‌లా అనిపించింది. గత 18 నెలలుగా మంచి క్రికెట్ ఆడుతున్నాను. సహచరులు, ప్రత్యర్థులు ఇచ్చిన గుర్తింపు ప్రత్యేకమైనది. ఈ అవార్డు నాకు గౌరవమని అన్నాడు.  

ఆస్ట్రేలియాకు ఆడటం నా కల
జేక్‌ ఆసీస్‌ తరఫున ఆడే అవకాశాల కోసం​ సుదీర్ఘంగా ఎదురుచూసి గత నెలలోనే ఇంగ్లండ్‌ కౌంటీ హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు ఆడటం నా కల. కానీ అది సాధ్యం కాలేదు. అయినా 12 సంవత్సరాలుగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడినందుకు గర్వంగా ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సమయం ఆసన్నమైందని అన్నాడు.

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)