Breaking News

టీమిండియా చీఫ్‌ సెలెక్టర్‌గా ధోనిని నియమించండి..!

Published on Thu, 06/22/2023 - 19:06

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని భారత జాతీయ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌గా నియమించాలని కొందరు భారత క్రికెట్‌ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా బీసీసీఐని డిమాండ్‌ చేస్తున్నారు. ధోని స్థాయికి చీఫ్‌ సెలెక్టర్‌ పదవి చిన్నదే అయినప్పటికీ ఆటగాళ్ల ఎంపికల విషయంలో పారదర్శకత ఉంటుందని వారంటున్నారు. ధోని చీఫ్‌ సెలెక్టర్‌ అయితేనే ఎలాంటి పక్షపాతాలు లేకుండా ప్రతిభే కొలమానంగా ఎంపికలు జరుగుతాయని గట్టిగా నమ్ముతున్నారు. 

ఐపీఎల్‌ కారణంగా ధోనికి యువ ఆటగాళ్లపై పూర్తిగా అవగాహణ ఉంది కాబట్టి, టాలెంట్‌ ఉన్న యువకులకు సరైన నాయ్యం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే ధోని ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పి కొద్దికాలం పాటు సెలెక్టర్‌గా, కోచ్‌గా, నేషనల్‌ క్రికట్‌ అకాడమీ ఛైర్మన్‌గా వ్యవహరించాలని కోరుతున్నారు. భారత్‌లో మరో తరం క్రికెట్‌ మెరుగుపడాలంటే ధోని ఈ త్యాగం చేయాలని ప్రాధేయపడుతున్నారు. 

ఇలా జరగడానికి అవకాశం లేకపోతే బీసీసీఐ తగు సవరణలు చేసైనా ధోనికి ఈ మూడు పదవులు కట్టబెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. టీమిండియాలో చాలామంది స్టార్ క్రికెటర్లకు వయసు పైబడుతుండటంతో, తదుపరి జనరేషన్‌ను ఇప్పటి నుంచే తీర్చిదిద్దుకోవడం కోసం ధోనికి ఈ మూడు కీలక పదవులు కట్టబెట్టాలని కోరుతున్నారు.

ధోని కొంత​కాలం పాటు ఈ మూడు పదవులు చేపడితే భారత క్రికెట్‌లో నెక్స్ట్‌ జనరేషన్‌ బాగుపడుతుందని అంటున్నారు. ధోనికి ఉన్న అపారమైన క్రికెట్‌ పరిజ్ఞానం, ఆట పట్ల అతనికున్న అంకితభావం, టాలెంట్‌ ఉన్న ఆటగాళ్లకు వీలైనన్ని అవకాశాలు ఇచ్చి వారి నుంచి సక్సెస్‌ను రాబట్టిన ట్రాక్‌ రికార్డును పరిగణలోకి తీసుకుని భారత క్రికెట్‌ భవిష్యత్తును ధోని చేతుల్లో పెట్టాలని కోరుతున్నారు. 

కాగా, భారత జాతీయ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌గా చేతన్‌ శర్మ తొలగించబడటంతో ఆ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధోనిని చీఫ్‌ సెలెక్టర్‌గా నియమించాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. త్వరలో ఆసియా కప్‌, వన్డే వరల్డ్‌కప్‌ లాంటి మెగా టోర్నీలు ఉండటంతో ధోని లాంటి వ్యక్తి అయితే సమతూకం కలిగిన జట్టును ఎంపిక చేయగలడని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ధోని విషయంలో వారికి ఇలాంటి ఆచరణ సాధ్యం కాని అంచనాలు ఉన్నప్పటికీ.. ఇది జరగడం దాదాపుగా అసాధ్యమేనని చెప్పాలి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)