Breaking News

ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కలేదు.. కట్‌ చేస్తే 'మెరుపు శతకం'తో బీభత్సం

Published on Mon, 08/25/2025 - 18:50

ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసిన పాకిస్తాన్‌ జట్టులో విధ్వంసకర బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖాన్‌కు చోటు దక్కలేదు. ఫామ్‌లేమి కారణంగా పాక్‌ సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. ఆసియా కప్‌ కోసం ఎంపి​క చేయకపోవడాన్ని అవమానంగా భావించిన ఉస్మాన్‌ ఖాన్‌.. దేశవాలీ టీ20 టోర్నీలో తన ప్రతాపాన్ని చూపించాడు.

ఘనీ రాయల్‌ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో వైటల్‌ టీ జట్టుకు ఆడుతున్న ఖాన్‌.. ఆదివారం​ జరిగిన మ్యాచ్‌లో 69 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేశాడు. ఫలితంగా అతని జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం​ ఈ భారీ లక్ష్యాన్ని సునాయాసంగా కాపాడుకుంది.

కాగా, ఉస్మాన్‌ ఖాన్‌కు పాక్‌ క్రికెట్‌ బోర్డు ఈ మధ్యకాలంలోనే మరో షాక్‌ కూడా ఇచ్చింది. ఈ ఏడాది సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితా నుంచి తొలగించింది. ఖాన్‌ గతేడాది డి-కేటగిరిలో కాంట్రాక్ట్‌ దక్కించుకున్నాడు. పేలవ ఫామ్‌ కారణంగా ఖాన్‌ పీసీబీ తాజాగా కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయాడు. 

పీసీబీ తమ స్టార్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజమ్‌, మొహమ్మద్‌ రిజ్వాన్‌లను తమ అత్యున్నత కాంట్రాక్ట్‌ అయిన ఏ కేటగిరి నుంచి తప్పించి బి కేటగిరికి డిమోట్‌ చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో దారుణంగా విఫలమవుతున్న కారణంగా పీసీబీ ఏ ఒక్క పాక్‌ ఆటగాడికి కూడా ఏ కేటగిరి కేటాయించలేదు.

30 ఏళ్ల ఉస్మాన్‌ ఖాన్‌కు పాక్‌ దేశవాలీ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. పీఎస్‌ఎల్‌ ద్వారా ఇతను భారీ హిట్టర్‌గా పేరు గడించాడు. అయితే ఖాన్‌కు పాక్‌ తరఫున పేలవమైన రికార్డు ఉంది. ఈ కుడి చేతి వాటం బ్యాటర్‌ తన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ 19 టీ20ల్లో కేవలం 239 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్ద సెంచరీ మాత్రమే ఉంది. పాక్‌ తరఫున 2 వన్డేలు కూడా ఆడిన ఖాన్‌.. ఇక్కడ కూడా విఫలమయ్యాడు.   
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)