Breaking News

మ్యాచ్‌ మధ్యలో గ్రౌండ్ లోకి పాము.. ఉలిక్కిపడిన ఆటగాళ్లు! వీడియో

Published on Thu, 07/03/2025 - 12:40

కొలంబో వేదిక‌గా తొలి వ‌న్డేలో శ్రీలంక‌-బంగ్లాదేశ్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి అనుకోని అతిథి స్టేడియం వచ్చింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సంద‌ర్భంగా సుమారు 6 అడుగుల పొడవున్న పాము మైదానంలో ప్ర‌త్య‌క్ష‌మైంది. బిగ్‌ స్క్రీన్‌లో పామ్‌ను చూసిన అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు.

ఆట‌గాళ్లు సైతం కాస్త గంద‌ర‌గోళానికి గుర‌య్యారు.  వెంటనే మైదాన సిబ్బంది దాన్ని అక్కడినుంచి బయటకి పంపించారు. దీంతో తిరిగి మళ్లీ ఆట ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. 

కాగా శ్రీలంక మైదానాల్లో సరృసృపాలు ప్రత్యక్షం కావడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌ సందర్భంగా వరుసగా రెండు మ్యాచ్‌లకు పాము హాజరై కలకలం రేపింది. అదేవిధంగా బంగ్లా-శ్రీలంక టెస్టు సిరీస్ సంద‌ర్భంగా పాములు ప‌ట్టుకుని స్నేక్ క్యాచర్ కూడా కెమెరాకు చిక్కాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే..  బంగ్లాదేశ్‌ను 77 పరుగుల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక కెప్టెన్ చ‌రిత్ అస‌లంక‌(106) సెంచ‌రీతో మెరిశాడు.

బంగ్లాదేశ్‌ బౌలర్లలో తస్కీన్‌ అహ్మద్‌ 4, తన్జీమ్‌ హసన్‌ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఓ ద‌శ‌లో సునాయ‌సంగా గెలిపించేలా క‌న్పించిన బంగ్లాదేశ్ వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోవ‌డంతో ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. లంక బౌలర్లలో హసరంగ 4, కమిందు మెండిస్‌ 3 వికెట్లు పడగొట్టారు. అసలంకకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.
చదవండి: గిల్‌.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గ‌ర్వ‌ప‌డుతుంటాడు: యువరాజ్‌

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు