Breaking News

స్మృతి మంధాన తండ్రికి హార్ట్‌ ఎటాక్‌

Published on Sun, 11/23/2025 - 16:44

ఇంకా పెళ్లి పీటలు ఎక్కడానికి కొన్ని గంటల ముందే భారత స్టార్‌ మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన ఆ తతాంగాన్ని వాయిదా వేసుకుంది. స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు హార్ట్‌ ఎటాక్‌ రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ చేసిన తర్వాత శ్రీనివాస్‌ అస్వస్థతగా కనిపించారు. 

అయితే మహారాష్ట్రలోని సంగ్లీలో పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైన వేళ.. మంధాన తండ్రి శ్రీనివాసన్‌ గుండె పోటుకు గురైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా సైతం ధ్రువీకరించాడు. "ఈ పరిస్థితుల్లో త‌న‌కు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మంంధాన తెల్చి చెప్పేసింది.తన తండ్రి పూర్తిగా కోలుకునే వరకు వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి నిర్ణయించుకుందని" తుహిన్ పేర్కొన్నాడు. 

ప్రస్తుతం శ్రీనివాస్‌  సంగ్లీ లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అత‌డి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు  కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా మంధాన వివాహం సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆదివారం(నవంబర్ 23) జరగాల్సి ఉంది. గత రెండు రోజులగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. హాల్డీ, మెహందీ, సంగీత్ కార్యకమాల్లో స్మృతితో పాటు సహచర భారత క్రికెటర్లు సందడి చేశారు. కానీ అంతలోనే ఊహించని సంఘటన చోటు చేసుకోవడంతో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.


 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)