Breaking News

ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును గెలుచుకున్న టీమిండియా స్టార్‌ బ్యాటర్‌

Published on Mon, 01/27/2025 - 14:33

భారత స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధన ఐసీసీ వుమెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2024 అవార్డు గెలుచుకుంది. గతేడాది వన్డేల్లో విశేషంగా రాణించినందుకు గానూ మంధనను ఈ అవార్డు వరించింది.

గతేడాది మొత్తం 13 వన్డేలు ఆడిన మంధన, నాలుగు సెంచరీల సాయంతో 57.86 సగటున, 95.15 స్ట్రయిక్‌రేట్‌తో 747 పరుగులు చేసింది. తద్వారా గతేడాది లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గానూ నిలిచింది. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మంధన.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై తలో సెంచరీ చేసింది.

ఐసీసీ వుమెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2024 అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్‌, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు. అయితే చివరికి ఈ అవార్డు మంధననే వరించింది. 

ఈ అవార్డు సాధించడానికి ముందు మంధన ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్‌, ఐసీసీ వుమెన్స్‌ టీ20 టీమ్‌లలో చోటు దక్కించుకుంది. వన్డే టీమ్‌కు మంధనతో పాటు భారత్‌ నుంచి దీప్తి శర్మ ఎంపిక కాగా.. టీ20 టీమ్‌లో మంధన, దీప్తి శర్మతో పాటు భారత్‌ నుంచి రిచా ఘోష్‌ కూడా చోటు దక్కించుకుంది.

ఐసీసీ వుమెన్స్‌ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్‌), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్‌), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్‌.

ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్‌), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్.

వ్యక్తిగత విభాగంలో ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు (2024)..
ఐసీసీ వుమెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌- స్మృతి మంధన 
ఐసీసీ మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌- అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 
ఐసీసీ ఎమర్జింగ్‌ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-అన్నెరీ డెర్క్‌సెన్‌
ఐసీసీ ఎమర్జింగ్‌ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-కమిందు మెండిస్‌
ఐసీసీ వుమెన్స్‌ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-ఈషా ఓఝా
ఐసీసీ మెన్స్‌ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-గెర్హార్డ్‌ ఎరాస్మస్‌
ఐసీసీ అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌
ఐసీసీ మెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-అర్షదీప్‌ సింగ్‌
ఐసీసీ వుమెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-మేలీ కెర్‌

 

 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)