చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి భారత ప్లేయర్‌గా

Published on Sun, 06/29/2025 - 07:38

ఇంగ్లండ్ పర్య‌ట‌నను భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఘ‌నంగా ఆరంభించింది. శ‌నివారం నాటింగ్‌హామ్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను 97 ప‌రుగుల తేడాతో భార‌త్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఉమెన్ ఇన్ బ్లూ ఆధిక్యంలో దూసుకెళ్లింది.

211 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇంగ్లండ్ అమ్మాయిలు చేధించ‌లేక‌పోయారు. భార‌త బౌల‌ర్ల దాటికి ఇంగ్లండ్ కేవ‌లం 113 ప‌రుగులకే ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో క‌డ‌ప‌ అమ్మాయి శ్రీచ‌ర‌ణీ నాలుగు వికెట్లతో స‌త్తాచాటింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలా రెం‍డు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ స్కివర్ బ్రంట్‌(66) టాప్ స్కోరర్‌గా నిలిచింది.

చ‌రిత్ర సృష్టించిన మంధాన
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెన‌ర్ స్మృతి మంధాన అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగింది. ఆది నుంచి దూకుడుగా ఆడిన మంధాన‌.. కేవ‌లం 51 బంతుల్లోనే త‌న తొలి టీ20 సెంచ‌రీ మార్క్‌ను అందుకుంది. స్మృతి మొత్తంగా 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసింది. ఈ క్ర‌మంలో మంధాన ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకుంది.

మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా స్మృతి చరిత్ర సృష్టించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఇండియా ఉమెన్ ప్లేయ‌ర్ కూడా ఈ ఫీట్ సాధించ‌లేక‌పోయారు.

అదేవిధంగా ఇంగ్లండ్‌పై అత్యధిక ఫిప్టీ ప్ల‌స్ స్కోర్లు సాధించిన మ‌హిళ క్రికెట‌ర్‌గా ఆసీస్ సూప‌ర్ స్టార్ బెత్ మూనీ రికార్డును మంధాన స‌మం చేసింది. ఆల్‌ఫార్మాట్‌లో మంధాన ఇప్ప‌టివ‌ర‌కు 8 సార్లు ఏభైకి పైగా ప‌రుగులు చేయ‌గా.. మూనీ కూడా స‌రిగ్గా 8 సార్లు ఫిప్టీ ప్ల‌స్ స్కోర్ సాధించింది.

ఇంగ్లండ్‌పై అత్యధిక 50 ప్ల‌స్‌ స్కోర్లు:
స్మృతి మంధాన: 8
బెత్ మూనీ: 8
మెగ్ లానింగ్: 5
డియాండ్రా డాటిన్: 3
హేలీ మాథ్యూస్: 3
డేన్ వాన్ నీక్: 3
చదవండి: అరంగేట్రంలోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా టీనేజర్‌

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)