Breaking News

చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్‌గా

Published on Mon, 12/22/2025 - 07:41

భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘ‌న‌త సాధించింది. అంత‌ర్జాతీయ టీ20ల్లో 4000 పరుగుల మైలురాయిని అత్యంత‌వేగంగా అందుకున్న మ‌హిళా క్రికెట‌ర్‌గా మంధాన చ‌రిత్ర సృష్టించింది. ఆదివారం వైజాగ్ వేదికగా శ్రీలం‍కతో జరిగిన తొలి టీ20లో మంధాన ఈ ఫీట్ నమోదు చేసింది.

స్మృతి ఈ రికార్డును కేవలం 3227 బంతుల్లోనే అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సుజీ బేట్స్ పేరిట ఉండేది. బేట్స్ 3675 బంతుల్లో ఈ ఘనత సాధించింది. తాజా ఇన్నింగ్స్‌తో కివీ ఓపెనర్‌ను స్మృతి అధిగమించింది. మంధాన  ఇప్పటివరకు  తన టీ20 కెరీర్‌లో 29.90 సగటుతో 4007 పరుగులు చేసింది.

ఆమె అత్యధిక వ్యక్తిగా స్కోర్‌గా 112 పరుగులగా ఉంది. అయితే మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సుజీ బేట్స్‌(4716) అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాత స్ధానాల్లో మంధాన(4007), హర్మన్‌ప్రీత్ కౌర్‌(3657) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంకపై  8 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్ విష్మి గుణరత్నే (39) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీచరణి తలో వికెట్ పడగొట్టగా.. ముగ్గురు శ్రీలంక బ్యాటర్లు రన్ అవుట్ అయ్యారు. అనంతరం  122 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెమిమా కేవలం 44 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది.
చదవండి: నితీశ్‌ రెడ్డి సారథ్యంలో...
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)