Breaking News

ప్రపంచకప్‌ జట్టులో స్టీవ్‌ స్మిత్‌

Published on Mon, 02/16/2026 - 16:08

ఆసీస్‌ దిగ్గజ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ టీ20 ప్రపంచకప్‌ 2026 జట్టులోకి లేటుగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ముందుగా అనుకున్నట్లు రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌కు ప్రత్యామ్నాంగా కాదు. స్మిత్‌ ఆసీస్‌ వరల్డ్‌కప్‌ టీమ్‌లోకి పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌కు రీప్లేస్‌మెంట్‌గా వచ్చాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.

కాలి గాయంతో బాధపడుతున్న హాజిల్‌వుడ్‌ సూపర్‌-8 సమయానికంతా కోలుకుంటాడని ముందుగా భావించారు. అయితే ఇలా జరగకపోగా.. హాజిల్‌వుడ్‌ టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. హాజిల్‌వుడ్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడం​ వల్లనే ప్రపంచకప్‌ జట్టు నుంచి తప్పించినట్లు సీఏ తెలిపింది.

ఆసీస్‌ సెలెక్టర్లు స్పెషలిస్ట్‌ పేసర్‌ అయిన హాజిల్‌వుడ్‌ స్థానాన్ని స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అయిన స్టీవ్‌తో భర్తీ చేయడం ఆసక్తికరంగా మారింది. పైగా స్టీవ్‌ అంతర్జాతీయ టీ20 ఆడక​ ఏడాదైపోయింది. టీ20 ప్రపంచకప్‌లో అతని చివరి ప్రదర్శన 2022లో వచ్చింది. 

స్టీవ్‌కు టీ20 ప్రపంచకప్‌తో పాటు యావత్‌ టీ20 ఫార్మాట్‌లోనే పెద్ద ట్రాక్‌ రికార్డు లేదు. అయితే స్టీవ్‌ ఎంపిక గత రికార్డులను చూసి కాకుండా, అతని తాజా బీబీఎల్‌ ప్రదర్శన ఆధారంగా జరిగింది. స్టీవ్‌ ఇటీవల ముగిసిన బీబీఎల్‌లో 59.80 సగటున, 167.97 స్ట్రయిక్‌రేట​్‌తో 299 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  

ఇవన్నీ పక్కకు పెడితే, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జింబాబ్వే చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొని సూపర్‌-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టీవ్‌ ఎంట్రీ ఆసీస్‌కు ఏమేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి. 

మరోపక్క ఆసీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ సేవలను కూడా తొలి రెండు మ్యాచ్‌లకు కోల్పోయింది. మార్ష్‌ గాయం కారణంగా ఐర్లాండ్‌, జింబాబ్వే మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. తొలుత స్టీవ్‌ను మార్ష్‌కు బ్యాకప్‌గా ఎంపిక చేశారు. 

అయితే ప్రస్తుతమందుతున్న సమాచారం ప్రకారం, మార్ష్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకొని తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. ఆసీస్‌ తమ తదుపరి మ్యాచ్‌లో (ఫిబ్రవరి 16) శ్రీలంకతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ ఆసీస్‌కు చాలా కీలకం. 

ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ జట్టు గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గ్రూప్‌-బిలో ఆసీస్‌ ప్రస్తుతం శ్రీలంక, జింబాబ్వే తర్వాత మూడో స్థానంలో ఉంది. శ్రీలంక మ్యాచ్‌ తర్వాత ఆసీస్‌ గ్రూప్‌ దశలో ఒమన్‌తో మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ ఫిబ్రవరి 20న జరుగనుంది.

అప్‌డేటెడ్‌ ఆసీస్‌ జట్టు..
మిచెల్‌ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కనెల్లీ, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎలిస్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)