Breaking News

వైభవ్ మెరుపులు.. సచిన్ కొడుకు అట్టర్ ప్లాప్‌

Published on Thu, 12/04/2025 - 18:12

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో సచిన్ టెండూల్కర్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్‌ అర్జున్ టెండూల్కర్ బ్యాట్‌తో రాణించలేకపోతున్నాడు. బౌలింగ్‌లో పర్వాలేదన్పిస్తున్న అర్జున్‌.. బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.

ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన అర్జున్ తన లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. గురువారం కోల్‌కతా వేదికగా బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ జూనియర్ టెండూల్కర్ బిహార్ పేసర్ సురాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

వైభవ్, గనీ మెరుపులు వృథా..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కెప్టెన్‌ గనీ(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. 

కేవలం 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. గోవా బౌలర్లలో దీప్‌రాజ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అర్జున్‌ 2 వికెట్లు సాధించాడు. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని గోవా కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కెప్టెన్‌ సుయాష్‌ ప్రభుదేశాయ్‌(79) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కశ్యప్ బఖలే(64) హాఫ్‌ సెంచరీతో రాణించాడు.
చదవండి: ENG vs AUS: శతక్కొట్టిన జో రూట్‌.. 12 ఏళ్ల నిరీక్షణకు తెర

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)