Breaking News

SMAT: తిలక్‌ వర్మ కాదు!.. హైదరాబాద్‌ కెప్టెన్‌గా అతడే

Published on Sat, 11/22/2025 - 08:17

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీ (SMAT)లో పాల్గొనే హైదరాబాద్‌ సీనియర్‌ జట్టును సెలక్షన్‌ కమిటీ శుక్రవారం ప్రకటించింది. పదిహేను మంది సభ్యుల ఈ టీమ్‌కు సీవీ మిలింద్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కాగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ కుమారుడే ఈ మిలింద్‌ అన్న విషయం తెలిసిందే. 

ఇకఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఉన్న హైదరాబాద్‌ తమ మ్యాచ్‌లన్నీ కోల్‌కతాలోనే ఆడుతుంది. ఏడు లీగ్‌ మ్యాచ్‌ల్లో మూడు ఈడెన్‌ గార్డెన్స్‌లో, నాలుగు జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ గ్రౌండ్‌లో జరుగుతాయి. తొలి పోరులో ఈ నెల 26న మధ్యప్రదేశ్‌తో హైదరాబాద్‌ తలపడుతుంది. ఈ గ్రూప్‌లో మరో ఆరు జట్లు మహారాష్ట్ర, గోవా, ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌, బిహార్, చండీగఢ్‌ ఉన్నాయి.

తిలక్‌ వర్మ బిజీబిజీ
ఇదిలా ఉంటే.. ఈ దేశీ టీ20 టోర్నీలో టీమిండియా స్టార్‌ తిలక్‌ వర్మ గతేడాది హైదరాబాద్‌ జట్టును ముందుకు నడిపించాడు. అయితే, సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నేపథ్యంలో తిలక్‌ జాతీయ జట్టు విధుల్లో బిజీగా గడుపనున్నాడు. 

ఈ నేపథ్యంలో తిలక్‌ స్థానంలో మిలింద్‌కు హైదరాబాద్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా స్వదేశంలో నవంబరు 22 నుంచి డిసెంబరు 19 మధ్య టీమిండియా సౌతాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.  

ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీకి హైదరాబాద్‌ జట్టు  
సీవీ మిలింద్‌ (కెప్టెన్‌), తనయ్‌ త్యాగరాజన్‌ (వైస్‌ కెప్టెన్‌), తన్మయ్‌ అగర్వాల్, అమన్‌ రావు, హెచ్‌కే సింహా, ఆశిష్‌ శ్రీవాత్సవ, నితేశ్‌ కనాల, అజయ్‌దేవ్‌ గౌడ్, ప్రజ్ఞయ్‌ రెడ్డి (వికెట్‌ కీపర్‌), భవేశ్‌ సేఠ్‌ (వికెట్‌ కీపర్‌), నితిన్‌ సాయి యాదవ్, రక్షణ్‌ రెడ్డి, ఎండీ అర్ఫాజ్, రిషికేత్‌ సిసోడియా, రాహుల్‌ బుద్ధి. 

చదవండి: వైభవ్‌ మెరుపులు వృధా.. ఆసియా కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)