Breaking News

ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. సుడిగాలి ఇన్నింగ్స్‌!

Published on Thu, 12/05/2024 - 13:38

భారత క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల సునామీ సృష్టించాడు. అయితే, శతకానికి కేవలం మూడు పరుగుల దూరంలో ఉన్నప్పుడు రుతురాజ్‌ అవుట్‌ కావడం దురదృష్టకరం.

కాగా దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఇటీవల రంజీ ట్రోఫీ(ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌)లో అదరగొట్టాడు. అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో మాత్రం రుతుకు శుభారంభం లభించలేదు. గత నాలుగు మ్యాచ్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ చేసిన పరుగులు వరుసగా.. 1, 19, 4, 2.

48 బంతుల్లోనే 97 పరుగులు
ఈ నేపథ్యంలో రుతు టీ20 బ్యాటింగ్‌ తీరుపై విమర్శలు రాగా.. సర్వీసెస్‌తో మ్యాచ్‌ సందర్భంగా బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఆష్రిన్‌ కులకర్ణి(29)తో కలిసి మహారాష్ట్ర ఇన్నింగ్స్‌ ఆరంభించిన రుతు.. 48 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి.

ఇక 202కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన రుతు.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉన్నపుడు అవుటయ్యాడు. సర్వీసెస్‌ బౌలర్‌ మోహిత్‌ రాఠీ బౌలింగ్‌లో వికాస్‌ హథ్వాలాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

రాహుల్‌ త్రిపాఠి విఫలం
మిగతా వాళ్లలో రాహుల్‌ త్రిపాఠి(13) విఫలం కాగా.. సిద్ధార్థ్‌ మాత్రే మెరుపు ఇన్నింగ్స్‌(19 బంతుల్లో 32), ధన్‌రాజ్‌ షిండే(14 బంతుల్లో 32) ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.

చదవండి: టీ20 క్రికెట్‌లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్‌ పాండ్యా లేకుండానే!

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు