Breaking News

సంజూ సేనను మట్టికరిపించిన ఆంధ్ర.. వరుసగా ఐదో విజయం

Published on Tue, 12/03/2024 - 21:01

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆంధ్ర క్రికెట్‌ జట్టు జోరు కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలు సాధించిన ఆంధ్ర.. తాజాగా ఐదో విజయం నమోదు చేసింది. కేరళతో ఇవాళ (డిసెంబర్‌ 3) జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సంజూ సేనను ఆంధ్ర బౌలర్లు 87 పరుగులకే (18.1 ఓవర్లలో) మట్టికరిపించారు. కేవి శశికాంత్‌ 3, కే సుదర్శన్‌, సత్యనారాయణ రాజు, బోధల కుమార్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. 

కేరళ ఇన్నింగ్స్‌లో జలజ్‌ సక్సేనా (27) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. అబ్దుల్‌ బాసిత్‌ (18), నిధీశ్‌ (14) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. టీమిండియా ఆటగాడు, కేరళ సారధి సంజూ శాంసన్‌ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు.. 13 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. శ్రీకర్‌ భరత్‌ అజేయమైన అర్ద శతకంతో (56) మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అశ్విన్‌ హెబ్బర్‌ 12, షేక్‌ రషీద్‌ 5, పైలా అవినాశ్‌ 0, రికీ భుయ్‌ 14 పరుగులు చేసి ఔటయ్యారు. 

కేరళ బౌలర్లలో జలజ్‌ సక్సేనా 3 వికెట్లు పడగొట్టగా.. నిధీశ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. తాజా ఓటమితో కేరళ గ్రూప్‌-ఈ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. ఆంధ్ర గ్రూప్‌ టాపర్‌గా కొనసాగుతుంది. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)