SL Vs WI: విండీస్‌తో రెండో టీ20.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక

Published on Tue, 10/15/2024 - 20:46

డంబుల్లా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్‌ నిస్సంక అర్ద సెంచరీతో (54) రాణించగా.. కుసాల్‌ మెండిస్‌ 26, కుసాల్‌ పెరీరా 24, కమిందు మెండిస్‌ 19, చరిత్‌ అసలంక 9, భానుక రాజపక్స 5, వనిందు హసరంగ 5 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో రొమారియో షెపర్డ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్‌, షమార్‌ జోసఫ్‌, షమార్‌ స్ప్రింగర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. కమిందు మెండిస్‌ (51), చరిత్‌ అసలంక (59) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రాండన్‌ కింగ్‌ (63), ఎవిన్‌ లెవిస్‌ (50) అర్ద సెంచరీలు చేసి విండీస్‌ను గెలిపించారు. 

చదవండి: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌.. భారీ రికార్డుపై కన్నేసిన విరాట్‌
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)