Breaking News

శ్రీలంకపై పాక్‌ విజయం.. అంత ఓవరాక్షన్‌ అవసరం లేదు.. సిగ్గు పడాలి..!

Published on Thu, 07/20/2023 - 13:37

శ్రీలంకతో ఇవాళ (జులై 20) ముగిసిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్ధేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇమాముల్‌ హక్‌ (50 నాటౌట్‌).. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (24), సౌద్‌ షకీల్‌ (30)ల సహకారంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో పాక్‌ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఛేదనలో కీలక ఇన్నింగ్స్‌ ఆడి, తొలి ఇన్నింగ్స్‌లో అజేయ డబుల్‌ సెంచరీతో చెలరేగిన సౌద్‌ షకీల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

ఈ విజయం తర్వాత పాక్‌ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆ జట్టు ఆటగాళ్లు ఏదో సాధించామన్న రేంజ్‌లో ఓవరాక్షన్‌ చేశారు. ఏదో వరల్డ్‌కప్‌ గెలిచేసినట్లు ఫీలైపోయారు. వాస్తవానికి గెలుపు ఎవరిపై అయినా, ఎలాంటి పరిస్థితుల్లో సాధించినా, ఎవరు సాధించినా అంగీకరించాల్సిందే. అయితే, ఇక్కడ పాక్‌ సాధించిన గెలుపుకు అంత ఓవరాక్షన్‌ అవసరం​ లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

ఎందుకంటే, ఆ జట్టు 365 రోజుల్లో సాధించిన ఏకైక విజయం ఇది. ఈ మధ్యలో ఆ జట్టు పదుల సంఖ్యలో టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడినా ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది. సరిగా ఇదే రోజున (జులై 20) 2022లో ఆ జట్టు చివరిసారిగా ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో గెలిచింది. ఈ విషయం​ తెలిసే కొందరు నెటిజన్లు పాక్‌ ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ఏడాదిలో ఒక్క విజయం సాధించినందుకు ఇంత సంబరం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఏడాదిగా తమ ప్రదర్శనను చూసి సిగ్గు పడాల్సింది పోయి, ఏదో సాధించామన్నట్లు ఓవరాక్షన్‌ ఎందుకని నిలదీస్తున్నారు. ఇంకొందరైతే.. ఏడాది తర్వాత సాధించిన విజయం కాబట్టి ఆ మాత్రం ఉంటుందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా సౌద్‌ షకీల్‌ పుణ్యమా అని పాక్‌కు సరిగ్గా ఏడాది తర్వాత తొలి విజయం లభించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)