డబ్ల్యూటీసీ ఫైనల్‌ కాదు.. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా! శ్రీలంకను చిత్తు చేసిన కివీస్‌

Published on Mon, 03/20/2023 - 11:48

వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కివీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. న్యూజిలాండ్‌ ఆహ్వానం మెరకు ఫాలో ఆన్‌ ఆడిన శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది.

దీంతో శ్రీలంక తమ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 58 పరుగులు వెనుకబడిపోయింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ, బ్లెయిర్ టిక్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రెస్‌వేల్‌ రెండు, డాగ్‌ బ్రెస్‌వేల్‌ , హెన్రీ తలా వికెట్‌ సాధించారు.

శ్రీలంక బ్యాటర్లలో ధనంజయ డి సిల్వా(98) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాగా అంతకుముందు లంకేయులు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 164 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక​ న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 584/4 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లెర్‌ చేసింది. కివీస్‌ బ్యాటర్లలో కేన్‌ విలియమ్సన్‌(215), హెన్రీ నికోల్స్‌(200) అద్భుతమైన డబుల్‌ సెంచరీలతో చెలరేగారు.

ఇక రెండు టెస్టుల్లోనూ అద్భుతంగా రాణించిన కేన్‌ విలియమ్సన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు లభించింది. అదే విధంగా ఈ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన నికోల్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌ అవార్డు వరించింది.

ఇక ఇది ఇలా ఉండగా.. డబ్ల్యూటీసీ ఫైనలే లక్ష్యంగా న్యూజిలాండ్‌ గడ్డపై అడుగుపెట్టిన శ్రీలంక.. ఇప్పుడు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా లంక జట్టును దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.
చదవండి: IND vs AUS: మూడో వన్డేకు సూర్యకుమార్‌ను తప్పిస్తారా..? క్లారిటీ ఇచ్చిన రోహిత్‌ శర్మ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)