Breaking News

బ్రాడ్‌మన్‌ రికార్డు సమం చేసిన కమిందు మెండిస్‌

Published on Fri, 09/27/2024 - 16:26

శ్రీలంక యువ సంచలనం కమిందు మెండిస్‌ క్రికెట్‌ దిగ్గజాల రికార్డును సమం చేశాడు. టెస్ట్‌ల్లో తొలి 13 ఇన్నింగ్స్‌ల్లోనే ఐదు సెంచరీలు చేసిన ఆటగాడిగా బ్రాడ్‌మన్‌, జార్జ్‌ హెడ్లీ సరసన నిలిచాడు. బ్రాడ్‌మన్‌, కమిందు, హెడ్లీ.. తమ తొలి 13 టెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు చేశారు. ఇన్నింగ్స్‌ల పరంగా టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్‌ ఐదు సెంచరీల రికార్డు ఎవర్టన్‌ వీక్స్‌ పేరిట ఉంది. వీక్స్‌ కేవలం 10 ఇన్నింగ్స్‌ల్లోనే ఐదు సెంచరీలు పూర్తి చేశాడు. 

ఆతర్వాత హెర్బర్ట్‌ సచ్‌క్లిఫ్‌, నీల్‌ హార్వే తొలి 12 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు చేశారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం ద్వారా కమిందు బ్రాడ్‌మన్‌ రికార్డు సమం చేశాడు. కమిందు తన కెరీర్‌లో తొలి 13 ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది సార్లు ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేశాడు. అలాగే తానాడిన తొలి ఎనిమిది టెస్ట్‌ల్లో కనీసం అర్ద సెంచరీ చేశాడు.

న్యూజిలాండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్‌తో (182 నాటౌట్‌) పాటు దినేశ్‌ చండీమల్‌ (116), కుసాల్‌ మెండిస్‌ (106 నాటౌట్‌) సెంచరీలతో కదంతక్కొడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 602 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. లంక ఇన్నింగ్స్‌లో ఏంజెలో మాథ్యూస్‌ (88), కరుణరత్నే (46), ధనంజయ డిసిల్వ (44) కూడా రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. టిమ్‌ సౌథీ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

ఫాస్టెస్ట్‌ 1000 రన్స్‌
న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులతో అజేయంగా నిలిచిన కమిందు మెండిస్‌ టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కమిందు ఈ మార్కును కేవలం 13 ఇన్నింగ్స్‌లోనే తాకాడు. తద్వారా డాన్‌ బ్రాడ్‌మన్‌ సరసన నిలిచాడు. బ్రాడ్‌మన్‌ కూడా టెస్ట్‌ల్లో తన తొలి వెయ్యి పరుగులను 13 ఇన్నింగ్స్‌ల్లోనే రీచ్‌ అయ్యాడు. టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్‌ 1000 పరుగుల రికార్డు హెర్బర్ట్‌ సచ్‌క్లిఫ్‌, ఎవర్టన్‌ వీక్స్‌ పేరిట ఉంది. వీరిద్దరు 12 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును తాకారు.

చదవండి: భారత్‌తో టెస్ట్‌ మ్యాచ్‌.. బంగ్లాదేశ్‌ వీరాభిమానిపై దాడి.. ఆసుపత్రికి తరలింపు

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)