సూర్యకుమార్‌ యాదవ్‌ రికార్డును సమం చేసిన హసరంగ

Published on Mon, 11/11/2024 - 17:11

శ్రీలంక స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ల ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌, బాబర్‌ ఆజమ్‌, డేవిడ్‌ వార్నర్‌, షకీబ్‌ అల్‌ హసన్‌లతో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం హసరంగ ఖాతాలో ఐదు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు ఉన్నాయి. అలాగే సూర్యకుమార్‌ యాదవ్‌, బాబర్‌ ఆజమ్‌, డేవిడ్‌ వార్నర్‌, షకీబ్‌ అల్‌ హసన్‌ పేరిట కూడా ఐదు ఐదు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు ఉన్నాయి. 

హసరంగ 23 టీ20 సిరీస్‌ల్లో ఐదు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు గెలుచుకుంటే.. స్కై 22 సిరీస్‌ల్లో, బాబర్‌ ఆజమ్‌ 35, వార్నర్‌ 42, షకీబ్‌ 45 సిరీస్‌ల్లో ఐదు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు గెలుచుకున్నారు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు గెలుచుకున్న రికార్డు టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి పేరిట ఉంది. విరాట్‌ 46 సిరీస్‌ల్లో ఏడు సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు గెలుచుకున్నాడు. కాగా, తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హసరంగ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఇది అతనికి ఐదో ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు.

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నిన్న (నవంబర్‌ 10) జరిగిన రెండో టీ20లో శ్రీలంక జట్టు 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. హసరంగ (4-1-17-4), మతీశ పతిరణ (4-1-11-3, నువాన్‌ తుషార (4-0-22-2), తీక్షణ (3.3-0-16-1) దెబ్బకు 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్‌ కాగా.. శ్రీలంక ఈ మాత్రం స్కోర్‌ను కూడా ఛేదించలేక 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా న్యూజిలాండ్‌ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. 

ఈ గెలుపులో న్యూజిలాండ్‌ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1 సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసి శ్రీలంక పతనానికి బీజం వేసిన లోకీ ఫెర్గూసన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించగా.. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆరు వికెట్లు తీసిన హసరంగకు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది. 

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)