Breaking News

SL Vs BAN: చరిత్ర సృష్టించిన శ్రీలంక బ్యాటర్‌.. టెస్ట్‌ క్రికెట్‌లో ఒకే ఒక్కడు..!

Published on Sun, 03/24/2024 - 14:48

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అద్భుతం జరిగింది. ఏడు అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి, ఒకే టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా శ్రీలంక స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కమిందు మెండిస్‌ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కమిందు ఈ అద్భుత రికార్డును నమోదు చేశాడు. 150 ఏళ్లకు పైబడిన టెస్ట్‌ క్రికెట్‌లో కమిందుకు ముందు ఒక్క ఆటగాడు కూడా ఈ ఘనత సాధించలేదు.

రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిల్హెట్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగి సెంచరీ (102) చేసిన కమిందు.. ఇదే మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ప్లేస్‌లో బరిలోకి దిగి 100 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో మరో ఘనత కూడ ఉంది. లంక కెప్టెన్‌ ధనంజయ​ డిసిల్వ కూడా ఈ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశాడు. ధనంజయ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులు చేసిన ధనంజయ.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 108 పరుగులు చేసి ఔటయ్యాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక ధనంజయ, కమిందు సెంచరీలతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేసి ఆలౌటైంది. వీరిద్దరు మినహా లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌.. విశ్వ ఫెర్నాండో (4/48), రజిత (3/56), లహిరు కుమార (3/31) విజృంభించడంతో 188 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తైజుల్‌ ఇస్లాం (47) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

92 పరుగుల లీడ్‌తో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక.. మూడో రోజు టీ సమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసి 430 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. లంక సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ధనంజయ, కమిందుతో పాటు కరుణరత్నే (52) కూడా రాణించాడు.  ‌
 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు