Breaking News

డబుల్‌ సెంచరీతో కదం​తొక్కిన ఖ్వాజా.. దిగ్గజాల సరసన చోటు

Published on Thu, 01/30/2025 - 18:42

గాలే వేదికగా శ్రీలంక (Sri Lanka), ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా (Australia) రికార్డు స్కోర్‌ సాధించింది. వ్యక్తిగతంగానూ ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. 

ఆసీస్‌ వెటరన్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా (Usman Khawaja) కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ సాధించగా.. స్టీవ్‌ స్మిత్‌ టెస్ట్‌ల్లో తన 35వ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో మరో ఆసీస్‌ ఆటగాడు సెంచరీతో మెరిశాడు.  జోస్‌ ఇంగ్లిస్‌ ఆసీస్‌ తరఫున తన అరంగేట్రం టెస్ట్‌లోనే శతక్కొట్టి రికార్డుల్లోకెక్కాడు. జట్టు స్కోర్‌ పరంగానూ ఆసీస్‌ ఈ మ్యాచ్‌లో రికార్డు సృష్టించింది. ఆసియా పిచ్‌లపై ఆసీస్‌కు ఇదే అత్యధిక స్కోర్‌.

దిగ్గజాల సరసన చేరిన ఖ్వాజా
ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా ఈ మ్యాచ్‌లో 352 బంతులు ఎదుర్కొని 16 బౌండరీలు, సిక్సర్‌ సాయంతో 232 పరుగులు చేశాడు. కెరీర్‌లో తన డబుల్‌ సెంచరీని ఖ్వాజా 38 ఏళ్ల 43 రోజుల వయసులో సాధించాడు. ఆసీస్‌ తరఫున క్రికెట్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ మాత్రమే ఖ్వాజా కంటే లేటు వయసులో డబుల్‌ సెంచరీలు చేశాడు. 

బ్రాడ్‌మన్‌ 38 ఏళ్ల 108 రోజుల వయసులో ఒకసారి.. 39 ఏళ్ల 149 రోజుల వయసులో మరోసారి డబుల్‌ సెంచరీలు చేశాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యంత లేటు వయసులో డబుల్‌ సెంచరీ చేసిన రికార్డు సౌతాఫ్రికాకు చెందిన ఎరిక్‌ రోవన్‌కు దక్కుతుంది. రోవన్‌ 42 ఏళ్ల 6 రోజుల వయసులో డబుల్‌ సెంచరీ సాధించాడు. 

టెస్ట్‌ క్రికెట్‌లో ఖ్వాజా కంటే లేటు వయసులో డబుల్‌ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో జాక్‌ హాబ్స్‌, వినూ మన్కడ్‌, గ్రహం గూచ్‌, యూనిస్‌ ఖాన్‌, శివ్‌నరైన్‌ చంద్రపాల్‌ వంటి దిగ్గజాలు ఉన్నారు. వీరిలో భారత్‌కు చెందిన వినూ మన్కడ్‌ 38 ఏళ్ల వయసులో రోజుల వ్యవధిలో రెండు సార్లు డబుల్‌ సెంచరీలు సాధించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఉస్మాన్‌ ఖ్వాజా (232) డబుల్‌ సెంచరీతో.. స్టీవ్‌ స్మిత్‌ (141), జోస్‌ ఇంగ్లిస్‌ (102) సెంచరీలతో కదంతొక్కడంతో ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 654 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఖ్వాజా, స్మిత్‌, ఇంగ్లిస్‌తో పాటు ట్రవిస్‌ హెడ్‌ (57), అలెక్స్‌ క్యారీ (46 నాటౌట్‌) కూడా రాణించారు. లబూషేన్‌ (20), వెబ్‌స్టర్‌ (23), స్టార్క్‌ (19 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య, జెఫ్రీ వాండర్సే తలో మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది.లంక బ్యాటర్లు ఒషాడో ఫెర్నాండో, దిముత్‌ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్‌ తలో ఏడు పరుగులు చేసి ఔట్‌ కాగా.. చండీమల్‌ (9), కమిందు మెండిస్‌ (13) క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు శ్రీలంక ఇంకా 610 పరుగులు వెనుకపడి ఉంది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)