Breaking News

శ్రీలంకతో తొలి టెస్ట్‌.. 700 వికెట్ల క్లబ్‌లో మిచెల్‌ స్టార్క్‌

Published on Thu, 01/30/2025 - 17:59

ఆస్ట్రేలియా పేస్‌ గన్‌ మిచెల్‌ స్టార్క్‌ (Mitchell Starc) అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయికి తాకాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో దిముత్‌ కరుణరత్నే వికెట్‌ పడగొట్టిన స్టార్క్‌.. 700 వికెట్ల క్లబ్‌లో (మూడు ఫార్మాట్లలో కలిపి) చేరాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం 17 మంది మాత్రమే 700 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు. 

స్టార్క్‌కు ముందు ముత్తయ్య మురళీథరన్‌ (1347), షేన్‌ వార్న్‌ (1001), జేమ్స్‌ ఆండర్సన్‌ (991), అనిల్‌ కుంబ్లే (956), గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (949), వసీం అక్రమ్‌ (916), స్టువర్ట్‌ బ్రాడ్‌ (847), షాన్‌ పొలాక్‌ (829), వకార్‌ యూనిస్‌ (789), టిమ్‌ సౌథీ (776), రవిచంద్రన్‌ అశ్విన్‌ (765), చమింద వాస్‌ (761), కోట్నీ వాల్ష్‌ (746), బ్రెట్‌ లీ (718), షకీబ్‌ అల్‌ హసన్‌ (712), హర్భజన్‌ సింగ్‌​ (711), డేనియల్‌ వెటోరీ (705) మాత్రమే ఈ ఘనత సాధించారు.

కెరీర్‌లో 94 టెస్ట్‌లు ఆడిన స్టార్క్‌ 377 వికెట్లు తీశాడు. 127 వన్డేల్లో 244, 65 టీ20ల్లో 79 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా స్టార్క్‌ తన కెరీర్‌లో 286 మ్యాచ్‌లు ఆడి 700 వికెట్లు తీశాడు. ఇందులో 24 ఐదు వికెట్ల ఘనతలు, 2 పది వికెట్ల ఘనతలు ఉన్నాయి.

శ్రీలంకతో మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టు రెండో రోజు టీ సెషన్‌ వరకు బ్యాటింగ్‌ చేసి 654/6 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా (232) కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీతో కదంతొక్కగా.. స్టీవ్‌ స్మిత్‌ (141), జోస్‌ ఇంగ్లిస్‌ (102) సెంచరీలతో సత్తా చాటారు. 

స్టీవ్‌ స్మిత్‌కు ఇది టెస్ట్‌ కెరీర్‌లో 35వ సెంచరీ కాగా.. ఇంగ్లిస్‌ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు ట్రవిస్‌ హెడ్‌ (57), అలెక్స్‌ క్యారీ (46 నాటౌట్‌) కూడా రాణించడంతో ఆస్ట్రేలియా శ్రీలంక గడ్డపై తొలిసారి 600 పరుగుల మార్కును దాటింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో లబూషేన్‌ 20, వెబ్‌స్టర్‌ 23 పరుగులు చేసి ఔట్‌ కాగా.. మిచెల్‌ స్టార్క్‌ 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. లంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య, జెఫ్రీ వాండర్సే తలో మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది.లంక బ్యాటర్లు ఒషాడో ఫెర్నాండో, దిముత్‌ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్‌ తలో ఏడు పరుగులు చేసి ఔటయ్యారు. చండీమల్‌ (9), కమిందు మెండిస్‌ (13) క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు శ్రీలంక ఇంకా 610 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌, రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తుంది.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)