Breaking News

అరంగేట్రంలోనే శతక్కొట్టిన ఆసీస్‌ బ్యాటర్‌

Published on Thu, 01/30/2025 - 15:48

గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా (Australia) వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జోస్‌ ఇంగ్లిస్‌ (Josh Inglis) సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌తోనే టెస్ట్‌ అరంగేట్రం చేసిన ఇంగ్లిస్‌.. అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 21వ ఆస్ట్రేలియన్‌ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

అలాగే గడిచిన పదేళ్లలో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆడమ్‌ వోగ్స్‌ 2015లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రంలోనే సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో ఇంగ్లిస్‌ మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. 

శ్రీలంక గడ్డపై అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆరో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఫవాద్‌ ఆలం (పాకిస్తాన్‌, 2009), సురేశ్‌ రైనా (భారత్‌, 2010), షాన్‌ మార్ష్‌ (ఆస్ట్రేలియా, 2011), మొహమ్మద్‌ అష్రాఫుల్‌ (బంగ్లాదేశ్‌, 2001), బెన్‌ ఫోక్స్‌ (ఇంగ్లండ్‌, 2018) శ్రీలంక గడ్డపై టెస్ట్‌ అరంగేట్రంలోనే సెంచరీలు చేశారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇంగ్లిస్‌కు ముందు ఉస్మాన్‌ ఖ్వాజా, స్టీవ్‌ స్మిత్‌ కూడా సెంచరీలు చేశారు. ఖ్వాజా సెంచరీతో ఆగకుంగా డబుల్‌ సెంచరీతో (232) కదంతొక్కగా.. స్టీవ్‌ స్మిత్‌ 141 పరుగులు చేసి ఔటయ్యాడు. 90 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్న ఇంగ్లిస్‌ 102 పరుగుల (10 ఫోర్లు, సిక్స్‌) వద్ద ఔటయ్యాడు. 

ఇంగ్లిస్‌ సెంచరీ చేయగానే అతని తల్లిదండ్రులు ఫ్లైయింగ్‌ కిస్‌లతో అభినందించారు. ఖ్వాజా, స్మిత్‌, ఇంగ్లిస్‌ సెంచరీలతో కదంతొక్కడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగుల మార్కును తాకింది. శ్రీలంక గడ్డపై ఆస్ట్రేలియా తొలిసారి టెస్ట్‌ల్లో పరుగులు చేసింది.

రెండో వేగవంతమైన శతకం
ఈ మ్యాచ్‌లో 90 బంతుల్లో శతక్కొట్టిన ఇంగ్లిస్‌ టెస్ట్‌ అరంగేట్రంలో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. టెస్ట్‌ అరంగేట్రంలో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు శిఖర్‌ ధనవ్‌ పేరిట ఉంది. ధవన్‌ 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 85 బంతుల్లోనే శతక్కొట్టాడు. ధవన్‌, ఇంగ్లిస్‌ తర్వాత టెస్ట్‌ అరంగేట్రంలో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్‌ స్మిత్‌ పేరిట ఉంది. స్మిత్‌ 2003లో సౌతాఫ్రికాపై 93 బంతుల్లో సెంచరీ చేశాడు.

ట్రవిస్‌ హెడ్‌ మెరుపు అర్ద శతకం
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ట్రవిస్‌ హెడ్‌ మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. హెడ్‌ టీ20 తరహాలో బ్యాటింగ్‌ చేసి 40 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో లబూషేన్‌ 20 పరుగులు చేయగా.. అలెక్స్‌ క్యారీ (39), బ్యూ వెబ్‌స్టర్‌ (23) తమ ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. 148 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా స్కోర్‌ 627/5గా ఉంది.

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)