ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌లో ఆసక్తికర పరిణామం

Published on Sun, 02/04/2024 - 17:05

ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్‌ చేతుల మీదుగా నూర్‌ అలీ జద్రాన్‌ టెస్ట్‌ అరంగేట్రం క్యాప్‌ అందుకున్నాడు. ఇందులో ఆసక్తి కలిగించే విషయం ఏముందని అనుకుంటున్నారా..? 

నూర్‌ అలీ జద్రాన్‌.. ఇబ్రహీం జద్రాన్‌ను స్వయానా బాబాయ్‌ అవుతాడు. ఇలా అబ్బాయి.. బాబాయ్‌ను జట్టులోకి ఆహ్వానించిన ఘటనలు క్రికెట్‌లో చాలా అరుదు. జద్రాన్‌ వయసు ప్రస్తుతం 22 ఏళ్లు కాగా.. నూర్‌ అలీ జద్రాన్‌ వయసు 35 సంవత్సరాలు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. బాబయ్‌, అబ్బాయిలు కలిసి శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.

బాబాయ్‌-అబ్బాయిలు ఆఫ్ఘన్‌ ఓపెనింగ్‌ బ్యాటర్లుగా బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బాబాయ్‌ నూర్‌ అలీ జద్రాన్‌ 31 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. అబ్బాయి ఇబ్రహీం జద్రాన్‌ డకౌటై నిరాశపరిచాడు. అయితే సెకండ్‌ ఇన్నింగ్స్‌ వచ్చే సరికి పరిప్థితి మారిపోయింది. ఈసారి బాబాయి, అబ్బాయి ఇద్దరూ రాణించారు.

బాబాయ్‌ నూర్‌ అలీ జద్రాన్‌ 47 పరుగులతో ఆకట్టుకోగా.. అబ్బాయి ఇబ్రహీం జద్రాన్‌ 77 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించారు. బాబాయ్‌ నూర్‌ అలీ జద్రాన్‌ లేటు వయసులో టెస్ట్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. అతని అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడో 15 ఏళ్ల కిందటే జరిగింది. నూర్‌ అలీ 2009లోనే వన్డే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్‌ పరిమిత ఓవర్ల జట్టులో నూర్‌ అలీ రెగ్యులర్‌ సభ్యుడు.

నూర్‌ అలీ ఇప్పటివరకు 51 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. ఇతను వన్డేల్లో సెంచరీ, ఏడు అర్ధసెంచరీల సాయంతో 1216 పరుగులు.. టీ20ల్లో 4 అర్దసెంచరీల సాయంతో 586 పరుగులు చేశాడు. మరోవైపు అబ్బాయి ఇబ్రహీం జద్రాన్‌ ఇప్పటివరకు 6 టెస్ట్‌లు, 28 వన్డేలు, 30 టీ20లు ఆడి 5 సెంచరీలు, 13 అర్దసెంచరీల సాయంతో దాదాపు 2500 పరుగులు చేశాడు. ఇబ్రహీం తన కెరీర్‌లో చేసిన ఐదు సెంచరీలు వన్డేల్లో చేసినవే కావడం విశేషం.

ఇదిలా ఉంటే, ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ కోసం ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి 2న మొదలైన టెస్ట్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో రహ్మత్‌ షా (91) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో  విశ్వ ఫెర్నాండో 4, ప్రభాత్‌ జయసూర్య, అషిత ఫెర్నాండో తలో 3 వికెట్లు పడగొట్టారు.

అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్‌ (141), చండీమల్‌ (107) సెంచరీలతో చెలరేగగా.. కరుణరత్నే అర్దసెంచరీతో (77) రాణించాడు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో నవీద్‌ జద్రాన్‌ 4, నిజత్‌ మసూద్‌, కైస్‌ అహ్మద్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన ఆఫ్ఘన్లు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో గట్టిగా పుంజుకున్నారు. మూడో రోజు మూడో సెషన్‌ సమయానికి ఆ జట్టు వికెట్‌ నష్టానికి 174 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్‌ (82), రహ్మత్‌ షా (41) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘన్లు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 66 పరుగులు వెనుకపడి ఉన్నారు. 
 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)