Breaking News

సూర్య‌కుమార్ యాద‌వ్ కీల‌క నిర్ణ‌యం

Published on Thu, 11/13/2025 - 17:36

రంజీ ట్రోఫీ 2025-26 త‌దుప‌రి రౌండ్ మ్యాచ్‌ల నుంచి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాద‌వ్‌, ఆల్‌రౌండ‌ర్ శివమ్ దూబే త‌ప్పుకొన్నారు. వాస్త‌వానికి న‌వంబ‌ర్ 16 నుంచి శ‌ర‌ద్ ప‌వార్ అకాడ‌మీ వేదిక‌గా పాండిచ్చేరితో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ముంబై త‌ర‌పున వీర‌ద్ద‌రూ ఆడాల్సింది.

కానీ  సౌతాఫ్రికాతో టీ20 సిరీప్‌కు సన్న‌ద‌మ‌య్యేందుకు ఈ రెడ్ బాల్ క్రికెట్ మ్యాచ్‌కు దూరంగా ఉండాల‌ని సూర్య‌, దూబే నిర్ణ‌యించుకున్నారు. ఈ స్టార్ క్రికెట‌ర్లు ఇప్ప‌టికే త‌మ నిర్ణ‌యాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి తెలియజేశారు. వారిద్దిరి స్ధానంలో   తనుష్ కొటియన్, మోహిత్ అవస్థిలను సెలెక్టర్లు జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఏడాది ఆఖ‌రిలో జ‌ర‌గ‌నున్న దేశ‌వాళీ టీ20 టోర్నీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం సూర్య ఆడ‌నున్నాడు. ఈ విష‌యాన్ని ఎంసీఎ అధికారి ఒక‌రు ధ్రువీక‌రించారు. ఈ టోర్నీని టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 స‌న్నాహాకంగా ఉప‌యోగించుకోవాల‌ని స్కై భావిస్తున్న‌డంట‌. 

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఈ ముంబై ఆట‌గాడు ప్ర‌స్తుతం గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాడు.  ఐపీఎల్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ప్ప‌టికి ఆ త‌ర్వాత ఆసియాక‌ప్‌, ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో నిరాశ‌ప‌రిచాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 84 పరుగులు మాత్ర‌మే సూర్య చేశాడు.

దీంతో స్వ‌దేశంలో స‌ఫారీల‌తో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌లో త‌న ఫామ్‌ను తిరిగి అందిపుచ్చుకోవాల‌ని సూర్య భావిస్తున్నాడు. ప్రోటీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ డిసెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది.
చదవండి: ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)