ద‌మ్ముంటే ఇప్పుడు బాజ్‌బాల్ ఆడండి.. రూట్‌పై సిరాజ్ సెటైర్‌! వీడియో

Published on Thu, 07/10/2025 - 21:28

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ మ‌రోసారి త‌న నోటికి ప‌నిచెప్పాడు. తొలి రోజు ఆట‌లో ఇంగ్లండ్ సీనియ‌ర్ బ్యాట‌ర్ జో రూట్‌ను స్లెడ్జింగ్ చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెన‌ర్లు జాక్ క్రాలీ, డ‌కెట్ ఘ‌న‌మైన ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించారు.

కానీ నితీశ్ కుమార్ వేసిన ఒకే ఓవ‌ర్‌లో ఇంగ్లండ్ ఓపెన‌ర్ల వికెట్ల‌ను కోల్పోయింది. 44 ప‌రుగుల‌కు రెండు వికెట్లు  కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన ఇంగ్లండ్‌ను ఓలీ పోప్‌, రూట్ అదుకునే ప్ర‌య‌త్నం చేశారు. వీరిద్ద‌రూ వీలు చిక్కిన‌ప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు న‌డిపించారు.

ఈ క్ర‌మంలో 31 ఓవ‌ర్ వేసిన సిరాజ్.. అద్బుత‌మైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి రూట్‌ను ఇబ్బందిపెట్టాడు. ఆ ఓవ‌ర్‌లో ఆరు బంతులు ఎదుర్కొన్న రూట్ క‌నీసం ఒక్క ప‌రుగు కూడా చేయ‌లేక‌పోయాడు. దీంతో ఓవ‌ర్ పూర్తియ్యాక రూట్ వ‌ద్ద‌కు సిరాజ్ వెళ్లి "ద‌మ్ముంటే బాజ్‌బాల్ ఇప్ప‌డు ఆడండి. నేను చూడాల‌నుకుంటున్నాను" సీరియస్‌గా అన్నాడు.

ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా బ్రెండన్ మెక‌ల్ల‌మ్ హెడ్‌కోచ్‌గా వ‌చ్చిన త‌ర్వాత ఇంగ్లండ్ టెస్టుల్లో బాజ్ బాల్ పేరిట దూకుడుగా ఆడుతూ వ‌స్తోంది. ఇక జో రూట్ 70 ప‌రుగులతో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు.

62 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్‌తో పాటు బెన్‌స్టోక్స్ ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు నితీశ్ కుమార్ రెడ్డి రెండు,  జ‌స్ప్రీత్ బుమ్రా, జ‌డేజా త‌లా వికెట్ సాధించారు.


 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)