Breaking News

ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు నామినేట్‌ అయిన టీమిండియా స్టార్లు

Published on Tue, 10/10/2023 - 12:35

2023 సెప్టెంబర్‌ నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు ఇ‍ద్దరు టీమిండియా ఆటగాళ్లు, ఓ ఇంగ్లండ్‌ ప్లేయర్‌ నామినేట్‌ అయ్యారు. సెప్టెంబర్‌ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్‌ గిల్‌, మొహమ్మద్‌ సిరాజ్, డేవిడ్‌ మలాన్‌‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు బరిలో నిలిచారు. 

గత నెలలో సూపర్‌ ఫామ్‌లో ఉండిన గిల్‌ 80 సగటున 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీల సాయంతో 480 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో 2 హాఫ్‌ సెంచరీలు, బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన గిల్‌ టీమిండియా ఆసియా కప్‌ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. అనంతరం అదే ఫామ్‌ను ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా కొనసాగించిన గిల్‌.. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 74, రెండో వన్డేలో 104 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. 

సిరాజ్‌ విషయానికొస్తే.. ఈ హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్‌ కూడా గత నెలలో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్‌ ఫైనల్లో శ్రీలంకపై నిప్పులు చెరిగిన సిరాజ్‌ ఏకంగా 6 వికెట్లు సాధించి, వన్డే ర్యాంకింగ్స్‌లో సైతం ఒక్కసారిగా భారీ జంప్‌ కొట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో పాటు సెప్టెంబర్‌ మొత్తంలో అద్భుతంగా రాణించిన సిరాజ్‌ 17.27 సగటున 11 వికెట్లు పడగొట్టాడు. 

మలాన్‌ విషయానికొస్తే.. ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తిన మలాన్‌ ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి పరుగుల వరద పారిస్తున్నారు. గత నెల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్లో వరుసగా 54, 96, 127 పరుగులు చేసిన మలాన్‌ 105.72 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించి, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)