Breaking News

'అదొక చెత్త నిర్ణ‌యం'.. ఐసీసీపై విండీస్ గ్రేట్ ఫైర్‌

Published on Wed, 01/08/2025 - 09:10

టెస్టు క్రికెట్‌కు ఆదరణను మరింత పెంచే దిశ‌గా అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ) అడుగులు వేస్తోంది. సంప్రదాయ ఫార్మాట్‌ను రెండు శ్రేణుల్లో( 2- Tier Test cricket) నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.

ఈ క్ర‌మంలోనే అగ్ర శ్రేణి జట్లైనా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ‌ధ్య‌ మ‌రిన్ని ఎక్కువ సిరీస్‌ల‌ను నిర్హహించాల‌ని ఐసీసీ యోచిస్తోంది. ఇదే విష‌యంపై ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ ప్రతినిధులు, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు, ఈసీబీ చీఫ్‌ ఈ నెలాఖరులో సమావేశం కానున్నారని ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

విండీస్ గ్రేట్ ఫైర్‌..
కాగా టెస్టుల్లో ఈ రెండంచెల విధానం ప్రతిపాదనపై వెస్టిండీస్ గ్రేట్ క్లైవ్ లాయిడ్ మండిప‌డ్డాడు. "ఐసీసీ నిజంగా టెస్టుల్లో 2 టైర్ విధానాన్ని తీసుకురావాల‌ని ఆలోచిస్తుంటే, అది క‌చ్చితంగా భ‌యంక‌ర‌మైన నిర్ణ‌య‌మ‌వుతోంది. టెస్టు క్రికెట్ హోదా పొందేందుకు క‌ష్ట‌ప‌డుతున్న చిన్న‌ జ‌ట్ల ప‌ట్ల శాపంగా మార‌నుంది. ఇక‌పై లోయర్‌ డివిజన్‌లో మిగతా జట్లు వాళ్లతో వాళ్లే ఆడుకుంటారు. 

దీంతో టెస్టు క్రికెట్‌కు ఆద‌ర‌ణ పెర‌గ‌డం కాదు మ‌రింత త‌గ్గుతోంది. చిన్న జట్లను అగ్ర జట్లతో ఎక్కువగా ఆడేలా చేయడంపై ఐసీసీ దృష్టి సారించాలి. అంతే తప్ప ఎటువంటి చెత్త నిర్ణయాలు తీసుకోకూడదు అని 80 ఏళ్ల క్లైవ్ లాయిడ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

వెస్టిండీస్ జట్టును రద్దు చేసి విడివిడిగా ఆడాలన్న ఐసీసీ మాజీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లే సూచనపై కూడా లాయిడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. " వరల్డ్ క్రికెట్‌లో వెస్టిండీస్ జ‌ట్టుకు గొప్ప చ‌రిత్ర ఉంది. అలాంటి జట్టును విడ‌దీయాల‌ని మాట్లాడుతున్నారు. అది సరైన ప‌ద్ద‌తి కాదు. వెస్టిండీస్‌తో స‌హా ఇన్ని జ‌ట్ల‌కు స‌మంగా డబ్బులిస్తే సౌకర్యాలను మెరుగుపరుచుకుంటారు. వారు తమ క్రికెట్‌ను మరింత మెరుగుపరచుకునేందుదు మెరుగైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటారు అని లాయిడ్ వ్యాఖ్యనించారు.
చదవండి: 'రాహుల్‌ ​కోసం అతడిని పక్కన పెట్టేశారు.. ఒక్క ఛాన్స్‌ ఇవ్వాల్సింది'
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)