Breaking News

అత‌డొక ర‌న్‌మిష‌న్‌.. మాంచెస్ట‌ర్‌లో కూడా చెల‌రేగుతాడు: భారత మాజీ క్రికెటర్‌

Published on Sun, 07/20/2025 - 12:30

ఆండ‌ర్స‌న్‌-టెండూల్క‌ర్ ట్రోఫీలో టీమిండియా కొత్త‌ టెస్టు కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ దుమ్ములేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో శ‌త‌క్కొట్టిన గిల్‌.. ఆ త‌ర్వాత ఎడ్జ్‌బాస్ట‌న్‌లో భీబ‌త్సం సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ(262)తో చెలరేగిన శుబ్‌మన్‌, రెండో ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో మెరిశాడు.

కానీ లార్డ్స్ లో జరిగిన మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల(16,6)లోనూ విఫలమయ్యాడు. ఈ క్ర‌మంలో శుబ్‌మ‌న్ గిల్‌పై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగే నాలుగో టెస్టులో గిల్ తిరిగి అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తాడని మంజ్రేక‌ర్ జోస్యం చెప్పాడు. కాగా సిరీస్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకోవాలంటే నాలుగో టెస్టులో భార‌త్ కచ్చితంగా గెల‌వాల్సిందే. ఈ కీల‌క మ్యాచ్‌లో గిల్ ఎలా రాణిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శుబ్‌మ‌న్ గిల్ గిల్ త‌న ఫామ్‌ను కొన‌సాగిస్తాడ‌ని నేను భావిస్తున్నాను. అత‌డికి ఆ స‌త్తా ఉంది. లార్డ్స్ టెస్టుకు మాంచెస్ట‌ర్‌లో జ‌రిగే నాలుగో టెస్టుకు దాదాపు ఎనిమిది రోజుల విశ్రాంతి ల‌భించింది. దీంతో అత‌డు కాస్త రిలాక్స్‌గా ఉంటాడు. త‌న తండ్రి, స్నేహితులతో చాలా విష‌యాలు అత‌డు చ‌ర్చించి ఉంటాడు. 

గిల్ త‌న కెప్టెన్సీ, వ్యూహాలు, ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌పై  పెట్టాలి. అప్పుడే మాంచెస్ట‌ర్‌లో గిల్‌ ర‌న్‌మిష‌న్ తిరిగి మ‌ళ్లీ ప‌నిచేస్తోంది. ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో గిల్ పాత్ర చాలా ముఖ్య‌మైనది. లార్డ్స్‌లో జ‌రిగిన మూడో టెస్టులో గిల్ బ్యాట్‌తో విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో భార‌త్ ఓడిపోయింది. అయిన‌ప్ప‌టికి మెన్ ఇన్ బ్లూ ఆఖ‌రి వ‌ర‌కు పోరాడింది. దీని బ‌ట్టి భార‌త జ‌ట్టు కేవ‌లం గిల్ ఒక్క‌డిపైనే ఆధార‌ప‌డ‌టం లేద‌ని ఆర్ధ‌మైంది అని జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)