Breaking News

సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్న శుబ్‌మన్‌ గిల్‌.. స్పైడ‌ర్ మ్యాన్‌తో!

Published on Mon, 05/08/2023 - 17:58

ఐపీఎల్‌-2023లో అదరగొడుతున్న టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ సరికొత్త అవతరమెత్తనున్నాడు. హాలీవుడ్ మూవీ "స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్"కు శుబ్‌మన్‌ గిల్‌ డ‌బ్బింగ్ చెప్పబోతున్నాడు. గిల్‌ హిందీతో పాటు పంజాబీ వెర్షన్‌లకు తన వాయిస్‌ను అందించనున్నాడు.

ఇక ఈ విష‌యాన్ని ఓ వీడియో ద్వారా మూవీ మేకర్స్ సోమ‌వారం రివీల్ చేశారు. ఈ యానిమేషన్ చిత్రాన్ని  సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా దేశవ్యాప్తంగా జూన్ 2న విడుదల చేయనుంది. ఈ మూవీ 10 భాషల్లో రిలీజ్‌ కానుంది. కాగా ప‌విత్ర్‌ ప్రభాక‌ర్ అలియాస్ ఇండియ‌న్ స్పైడ‌ర్ మ్యాన్ అనే క్యారెక్టర్‌ నేప‌థ్యంలో ఇండియ‌న్ వెర్షన్‌ మూవీ సాగ‌నుంది.

ఇండియ‌న్ వెర్షన్‌లో స్పైడ‌ర్ మ్యాన్ చిత్రం తొలిసారి తెరక్కించారు. హిందీ, పంజాబీ భాషల్లో ఇండియన్ స్పైడర్ మ్యాన్ చిత్రానికి వాయిస్‌ అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అని ఓ ప్రకటనలో గిల్‌ పేర్కొన్నాడు.

గిల్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన గిల్‌.. నాలుగు హాఫ్ సెంచ‌రీల‌తో 469 పరుగులు చేశాడు.
చదవండి: #WTC Final: రాహుల్‌ స్థానంలో యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. బీసీసీఐ ప్రకటన

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)