Breaking News

చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో శుబ్‌మన్‌ గిల్‌

Published on Wed, 07/22/2026 - 15:02

టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వన్డేల్లో వరల్డ్‌నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానానికి గిల్ మరింత చేరవయ్యాడు. 

ప్రస్తుతం అగ్రస్ధానంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డారిల్ మిచెల్ 802 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానంలో ఉండగా.. గిల్ (801) కేవలం ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. తదుపరి ఐసీసీ ర్యాంకింగ్స్ అప్‌డేట్‌లో గిల్ అగ్రస్థానానికి చేరుకుంటే.. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని అదరోహించిన  అత్యంత పిన్న వయస్కుడైన భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. 

గతంలో భారత్ తరపున వన్డేల్లో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజ క్రికెటర్లు టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లలో 94.00 అద్భుత సగటుతో 188 పరుగులు సాధించి, భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శ కారణంగానే అతడిని నంబర్-1 ర్యాంక్ రేసులో ఉన్నాడు.

కాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా కొనసాగుతోంది. గిల్‌తో పాటు విరాట్ కోహ్లి 767 పాయింట్లతో మూడో స్థానంలో,  మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 758 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ సిరీస్‌లో రోహిత్‌, కోహ్లి కూడా మెరుగైన ప్రదర్శన చేశారు. ఇక ఇదే సిరీస్‌లో దుమ్ములేపిన ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ నాలుగు స్ధానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)