Breaking News

బాబర్‌ ఆజమ్‌ టాప్‌ ర్యాంక్‌కు అతి చేరువగా శుభ్‌మన్‌ గిల్‌

Published on Thu, 02/13/2025 - 15:55

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) టీమిండియా వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) రెండో స్థానానికి ఎగబాకాడు. పాక్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (Babar Azam) టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. బాబర్‌కు గిల్‌కు మధ్య రేటింగ్‌ పాయింట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. గిల్‌ మరో 6 పాయింట్లు సాధిస్తే బాబర్‌ ఆజమ్‌కు కిందకు దించి టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంటాడు. 

గిల్‌ రెండో స్థానానికి చేరడంతో అప్పటివరకు ఆ స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) మూడో స్థానానికి పడిపోయాడు. వచ్చే వారం ప్రకటించే ర్యాంకింగ్స్‌లో రోహిత్‌కు కూడా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మూడో స్థానంలో ఉన్న రోహిత్‌కు టాప్‌ ప్లేస్‌లో ఉన్న బాబర్‌కు మధ్య కేవలం 13 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ప్రస్తుతం బాబర్‌ ఖాతాలో 786 పాయింట్లు, గిల్‌ ఖాతాలో 781, రోహిత్‌ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.

ఈ వారం ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి రెండు స్థానాలు కోల్పోయాడు. గత వారం నాలుగో ప్లేస్‌లో ఉన్న కోహ్లి.. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో విఫలం కావడంతో ఆరో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల్లో రాణించిన భారత మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరుకున్నాడు. ఈ వారం టాప్‌-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నలుగురు భారత బ్యాటర్లు ఉన్నారు. 

ఐర్లాండ్‌ ఆటగాడు హ్యారీ టెక్టార్‌ నాలుగో స్థానంలో, హెన్రిచ్‌ క్లాసెన్‌ ఐదులో, డారిల్‌ మిచెల్‌ ఏడులో, షాయ్‌ హోప్‌, రహ్మానుల్లా గుర్భాజ్‌ ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన మూడో వన్డే తాజా ర్యాంకింగ్స్‌ పరిగణలోకి రాలేదు.

వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. రషీద్‌ ఖాన్‌ అగ్రస్థానానికి నిలబెట్టుకున్నాడు. మహీశ్‌ తీక్షణ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. నమీబియా బౌలర్‌ బెర్నార్డ్‌ స్కోల్జ్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు చేరాడు. పాక్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది నాలుగో స్థానాన్ని కాపాడుకోగా.. భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మూడు స్థానాలు కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోయాడు. 

ఇంగ్లండ్‌తో తాజాగా జరిగిన సిరీస్‌కు దూరంగా ఉన్న మొహమ్మద్‌ సిరాజ్‌ నాలుగు స్థానాలు కోల్పోయి 10వ ప్లేస్‌కు పడిపోయాడు. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే టాప్‌-10లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మొహమ్మద్‌ నబీ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా 10వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)