Breaking News

జై షాకు శుభ్‌మన్ గిల్ ప్రత్యేక విజ్ఞప్తి

Published on Mon, 07/13/2026 - 20:49

భారత టెస్ట్‌, వన్డే జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఐసీసీ ఛైర్మన్ జై షాకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. వన్డే క్రికెట్‌కు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే ముక్కోణపు సిరీస్‌లు, నాలుగు దేశాల టోర్నీలను పునరుద్ధరించాలని కోరాడు.

ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన గిల్, ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 50 ఓవర్ల క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

"ముక్కోణపు సిరీస్‌లు, నాలుగు దేశాల టోర్నీలను మళ్లీ ప్రారంభించాలి. జట్లు కొత్త పరిస్థితుల్లో ఆడే అవకాశం లభిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి 50 ఓవర్ల క్రికెట్ చూస్తూ పెరిగాను. వన్డేలను 40 ఓవర్లకు కుదించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం" అని అన్నాడు.

ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రై-సిరీస్‌లు, నాలుగు దేశాల టోర్నీలు ఎంతో ఆదరణ పొందేవి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రతి ఏడాది నిర్వహించే ట్రై-సిరీస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే టీ20 క్రికెట్ విస్తరణతో అలాంటి టోర్నీలు క్రమంగా అంతరించిపోయాయి.

కాగా, ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.

తాజాగా భారత్‌ ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ చేతిలో టీ20 సిరీస్‌లు కోల్పోవడంతో ఈ సిరీస్‌ను ప్రాధాన్యత మరింత పెరిగింది. శుభ్‌మన్‌ గిల్‌ అయినా టీమిండియాను తిరిగి విజయాల బాట పట్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌ కోసం​ ఇంగ్లండ్‌ తుది జట్టును ప్రకటించగా.. భారత జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. 
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)