Breaking News

వారెవ్వా గిల్.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే అద్బుత సెంచరీ

Published on Fri, 06/20/2025 - 22:32

టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ త‌న కెరీర్‌ను ఘ‌నంగా ఆరంభించాడు. లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో ప్రారంభ‌మైన తొలి టెస్టులో గిల్ సెంచ‌రీతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్‌.. విరాట్ కోహ్లిని తలపించాడు. 

తొలుత దూకుడుగా ఆడిన శుబ్‌మన్‌, జైశ్వాల్ ఔటయ్యాక ఆచిచూచి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 140 బంతుల్లో గిల్ తన ఆరో టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 14 ఫోర్లు ఒక సిక్సర్‌ ఉన్నాయి. అతడి ​కంటే ముందు యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌ 16 ఫోర్లు, 1 సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ డెబ్యూలో సెంచరీతో చెలరేగిన గిల్‌ ఓ అరుదైన రికార్డును తన పేరిట లఖించుకున్నాడు.

భారత టెస్టు కెప్టెన్‌గా అరంగేట్ర ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్‌గా గిల్ నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన  జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం విజయ్ హజారే అగ్రస్ధానంలో ఉన్నారు.  1951లో కెప్టెన్‌గా తన అరంగేట్ర ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పైనే సెంచరీ చేశారు.

భారత టెస్ట్ కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ప్లేయర్లు వీరే..
164* విజయ్ హజారే వర్సెస్‌ ఇంగ్లండ్‌, ఢిల్లీ 1951
116 సునీల్ గవాస్కర్ vs న్యూజిలాండ్‌ ఆక్లాండ్ 1976
115 విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియన్ అడిలైడ్ 2014
102*శుబ్‌మన్ గిల్ vs ఇంగ్లాండ్ హెడింగ్లీ 2025

భారీ స్కోర్‌ దిశగా భారత్‌..
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతుంది. 78 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 మూడు వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్‌ పంత్‌(46), గిల్‌(112) ఉన్నారు.

 

 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)