Breaking News

ప్రతిష్టాత్మక అవార్డు రేసులో శుబ్‌మన్ గిల్‌! అతడికి పోటీ ఎవరంటే?

Published on Wed, 08/06/2025 - 18:32

జూలై నెల‌కు గాను ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తాజాగా ప్రకటించింది. ప‌రుషుల విభాగంలో ముగ్గురు ఆట‌గాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఇందులో ఇద్ద‌రి ఆట‌గాళ్లు ఆండ‌ర్స‌న్‌-టెండూల్క‌ర్ ట్రోఫీ నుంచి ఎంపికైన‌వారే. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్, ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ ఉన్నారు. వీరిద్ద‌రితో పాటు ద‌క్షిణాఫ్రికా ఆల్‌రౌండ‌ర్ వియాన్ ముల్డ‌ర్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు.

అద‌ర‌గొట్టిన గిల్‌..
ఇంగ్లండ్ గ‌డ్డ‌పై గ‌త నెల‌లో శుబ్‌మ‌న్ గిల్ ప‌రుగులు వ‌ర‌ద పారించాడు. గిల్ కెప్టెన్‌గా త‌న తొలి టెస్టు సిరీస్‌లోనే అద‌ర‌గొట్టాడు.  25 ఏళ్ల ఈ పంజాబీ క్రికెట‌ర్ ఐదు మ్యాచ్‌ల‌లో  75.40 సగటుతో 754 పరుగులు చేశాడు. గ‌త నెల‌లో ఎడ్జ్‌బాస్ట‌న్‌లో జ‌రిగిన రెండో టెస్టులో గిల్(261) ఏకంగా డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 161 ప‌రుగులు చేశాడు.

ఒక మ్యాచ్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ప్లేయ‌ర్‌గా గిల్‌(430) నిలిచాడు. అంతేకాకుండా ఒక ఒక టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో భార‌త ప్లేయ‌ర్‌గా గిల్ రికార్డు నెల‌కొల్పాడు.  శుబ్‌మ‌న్ త‌న అద్బుత‌ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ప్లేయ‌ర్‌గా ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలోనే గిల్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డుకు ఐసీసీ నామెనేట్ చేసింది.

స్టోక్స్ ఆల్‌రౌండ్ షో..
మ‌రోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్‌.. 43.43 స‌గ‌టుతో 304 ప‌రుగులు చేశాడు. అంతేకాకుండా 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అయితే ఆఖ‌రి టెస్టుకు గాయం కార‌ణంగా స్టోక్స్ దూర‌మ‌య్యాడు.

అదేవిధంగా ద‌క్షిణాఫ్రికా ఆల్‌రౌండ‌ర్ వియాన్ ముల్డ‌ర్.. జింబాబ్వేతో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. రెండో టెస్టులో ముల్డ‌ర్ (367 నాటౌట్‌) ఏకంగా ట్రిపుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. వీరిముగ్గ‌రిలో ఎవ‌రిని ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు వ‌రిస్తుందో త్వ‌రలోనే తెలియ‌నుంది.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)