మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. శుభ్‌మన్‌ గిల్‌ సహచరుడు అరెస్ట్‌

Published on Fri, 07/17/2026 - 15:57

లంక ప్రీమియర్ లీగ్ (LPL) 2026 ప్రారంభానికి కొద్ది గంటల ముందు సంచలన పరిణామం చోటు చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీ సహ యజమాని మంజోత్ కల్రాను శ్రీలంక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు విభాగం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధృవీకరించారు.

టోర్నీ ప్రారంభానికి ముందే ఓ ఆటగాడిని మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రేరేపించే ప్రయత్నం చేశారనే ఆరోపణల నేపథ్యంలో మంజోత్ కల్రాపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని శ్రీలంక పోలీసులు వెల్లడించారు. క్రీడల్లో అవినీతి నిరోధానికి శ్రీలంకలో కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి.

టీమిండియా కెప్టెన్‌ సహచరుడు
మంజోత్ కల్రా భారత అండర్-19 జట్టు మాజీ క్రికెటర్ 2018 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ శతకం బాది భారత్‌కు టైటిల్ అందించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఆ జట్టులో పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు.

డిఫెండింగ్ చాంపియన్‌గా జాఫ్నా
మైదానం వెలుపల వివాదం నెలకొన్నప్పటికీ, జాఫ్నా కింగ్స్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఎల్‌పీఎల్ 2026 బరిలోకి దిగుతోంది. భానుక రాజపక్స కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న ఈ జట్టులో షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్, సందీప్ లామిచానే, అవిష్క ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక, ఇబ్రహీం జద్రాన్, డేవిడ్ వీజ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. టోర్నీ తొలి మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ గాలే జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఇవాళ (జులై 17) రాత్రి 7:30 గంటలకు ప్రారంభ​ం కానుంది.

 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)