Breaking News

నంబర్‌ వన్‌గా కొనసాగుతున్న శుభ్‌మన్‌ గిల్‌

Published on Wed, 04/09/2025 - 19:41

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. ప్రపంచవాప్తంగా ఉన్న ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో బిజీగా ఉండగా.. పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ మాత్రమే వన్డే సిరీస్‌ ఆడాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్లకు చెందిన కొందరు ఆటగాళ్ల ర్యాంక్‌లు మాత్రమే మారాయి. 

బ్యాటింగ్‌లో టీమిండియా ప్రిన్స్‌ శుభ్‌మన్‌ గిల్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్‌ నుంచి విరాట్‌ (5), శ్రేయస్‌ అయ్యర్‌ (8) టాప్‌-10లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 72 పరుగులు చేసిన పాక్‌ కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 21వ స్థానానికి చేరగా.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 89 స్థానానికి చేరాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ​ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత్‌ రిస్ట్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్‌ నుంచి కుల్దీప్‌తో పాటు రవీంద్ర జడేజా (9) ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు. పాక్‌తో సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన సహా 10 వికెట్లు తీసిన న్యూజిలాండ్‌ పేసర్‌ బెన్‌ సియర్స్‌ ఏకంగా 64 స్థానాలు మెరుగపర్చుకుని 100వ స్థానానికి చేరాడు. పాక్‌ పేసర్‌ నసీం​ షా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 43వ స్థానానికి ఎగబాకాడు.

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. మరో ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు మహ్మద్‌ నబీ రెండో స్థానంలో నిలిచాడు. జింబాబ్వే ఆటగాడు సికందర్‌ రజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌ నుంచి టాప్‌-10లో రవీంద్ర జడేజా (9) ఒక్కడే ఉన్నాడు. జడ్డూ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10 నుంచి 9కి చేరాడు. పాక్‌తో జరిగిన సిరీస్‌లో 85 పరుగులు చేసి 2 వికెట్లు తీసిన మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (5) రెండు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్‌-5లోకి వచ్చాడు.  
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)