Breaking News

‘రంజీ’ బరిలో గిల్‌

Published on Tue, 01/20/2026 - 07:56

న్యూఢిల్లీ: భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ విశ్రాంతి తీసుకోకుండా వెంటనే రంజీ ట్రోఫీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. గిల్‌ సారథ్యంలోని టీమిండియా 1–2తో తొలిసారి భారత గడ్డపై న్యూజిలాండ్‌కు  వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఆదివారమే కివీస్‌తో ఈ సిరీస్‌ ముగిసింది. 

రోజుల వ్యవధిలోనే గురువారం నుంచి సౌరాష్ట్రతో తలపడే పంజాబ్‌ తరఫున రంజీ మ్యాచ్‌ బరిలోకి దిగేందుకు గిల్‌ సై అంటున్నాడు. 26 ఏళ్ల ఈ కెప్టెన్ విశ్రాంతి గురించి ఆలోచించడం లేదని, రాజ్‌కోట్‌లో జరిగే రంజీ పోరు కోసం ఇండోర్‌ నుంచి నేరుగా అక్కడికే పయనమవుతాడని పంజాబ్‌ జట్టు వర్గాలు తెలిపాయి. గత సీజన్‌లో మాదిరిగా ఈసారి కూడా రంజీ ట్రోఫీకి మధ్యలో విరామమిచ్చారు. ముస్తాక్‌ అలీ టి20, విజయ్‌ హజారే వన్డే టోరీ్నల కోసం రంజీలకు బ్రేక్‌ ఇచ్చారు. 

ఈ రెండు పరిమిత ఓవర్ల ఈవెంట్లు ముగియడంతో గురువారం నుంచి దేశవ్యాప్తంగా మిగిలిన రెండు రౌండ్‌ల రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్ని కొనసాగించనున్నారు. మొత్తం ఎనిమిది జట్లున్న గ్రూప్‌ ‘బి’లో పంజాబ్‌ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లాడింది. ఒక మ్యాచ్‌ గెలిచి మరో మ్యాచ్‌ ఓడింది. మిగతా మూడింటిని ‘డ్రా’ చేసుకున్న పంజాబ్‌ 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇంకా మూడే లీగ్‌ మ్యాచ్‌లున్నాయి. నాకౌట్‌ దశకు అర్హత సాధించాలంటే ఈ మూడు మ్యాచ్‌ల్నీ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. గిల్‌ రాకతో పంజాబ్‌ పటిష్టంగా మారింది.   

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)