Breaking News

అగ్రపీఠాన్ని అధిరోహించిన శుభ్‌మన్‌ గిల్‌

Published on Wed, 02/19/2025 - 14:49

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండిన గిల్‌.. ఓ స్థానం మెరుగుపర్చుకుని టాప్‌ ర్యాంక్‌కు చేరాడు. నంబర్‌ వన్‌ స్థానానికి చేరే క్రమంలో గిల్‌ పాక్‌ స్టార్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ను వెనక్కు నెట్టాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో బాబర్‌ 773 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 

సచిన్‌, విరాట్‌, ధోని తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానానికి చేరిన నాలుగో భారత బ్యాటర్‌గా గిల్‌ రికార్డుల్లోకెక్కాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌ నంబర్‌ స్థానానికి చేరడం ఇది తొలిసారి కాదు. 2023 వన్డే ప్రపంచకప్‌ సమయంలోనూ గిల్‌ టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. ప్రస్తుతం గిల్‌ ఖాతాలో 796 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. గిల్‌కు రెండో స్థానంలో ఉన్న బాబర్‌కు మధ్య 23 పాయింట్ల వ్యత్యాసం ఉంది.

ఈ వారం ర్యాంకింగ్స్‌లో గిల్‌తో కలుపుకుని భారత్‌ నుంచి నలుగురు ఆటగాళ్లు టాప్‌-10లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడో స్థానంలో.. విరాట్‌ కోహ్లి ఆరులో.. శ్రేయస్‌ అయ్యర్‌ 9వ స్థానంలో నిలిచారు. గత వారంతో పోలిస్తే  శ్రేయస్‌ ఓ ర్యాంక్‌ మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు. 

తాజా ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ నాలుగులో, న్యూజిలాండ్‌ ప్లేయర్‌ డారిల్‌ మిచెల్‌ ఐదులో.. ఐర్లాండ్‌ ఆటగాడు హ్యారీ టెక్టార్‌ ఏడులో.. లంక కెప్టెన్‌ అసలంక ఎనిమిదిలో.. షాయ్‌ హోప్‌ పదో స్థానంలో ఉన్నారు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ను కిందకు దించి లంక స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ టాప్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఓ స్థానం మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి చేరాడు. భారత్‌ నుంచి టాప్‌-10లో కుల్దీప్‌తో పాటు సిరాజ్‌ (10వ ర్యాంక్‌) మాత్రమే ఉన్నాడు. నమీబియా బౌలర్‌ బెర్నాల్డ్‌ స్కోల్జ్‌ మూడులో.. షాహీన్‌ అఫ్రిది ఐదులో.. కేశవ్‌ మహారాజ్‌ ఆరులో.. మిచెల్‌ సాంట్నర్‌  ఏడులో .. మ్యాట్‌ హెన్రీ ఎనిమిదిలో.. గుడకేశ్‌ మోటీ తొమ్మిది స్థానాల్లో ఉన్నారు.

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌ వెటరన్‌ మొహమ్మద్‌ నబీ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. జింబాబ్వే ఆటగాడు సికందర్‌ రజా రెండో స్థానంలో నిలిచాడు. భారత్‌ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు. జడ్డూ 217 రేటింగ్‌ పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. జట్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. టీమిండియా టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుంది. భారత్‌.. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు అందనంత ఎత్తులో ఉంది. ఇరు జట్లకు మధ్య దాదాపు 800 రేటింగ్‌ పాయింట్ల వ్యత్యాసం ఉంది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)