Breaking News

చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌ గిల్‌

Published on Tue, 10/28/2025 - 11:42

టీమిండియా టెస్ట్‌, వన్డే జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) చరిత్ర సృష్టించాడు. భారత కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో తొలి విజయాన్ని విదేశాల్లో నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. భారత కెప్టెన్‌గా టీ20ల్లో తన తొలి విజయాన్ని (తాత్కాలిక కెప్టెన్‌గా) జింబాబ్వేలో నమోదు చేసిన గిల్‌.. టెస్ట్‌ల్లో తొలి విజయాన్ని ఇంగ్లండ్‌లో, వన్డేల్లో తొలి విజయాన్ని ఆస్ట్రేలియా గడ్డపై సాధించాడు.

తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో విజయం అనంతరం గిల్‌ ఖాతాలో ఈ అల్టిమేట్‌ రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌ గెలవడంతో భారత్‌ క్లీన్‌ స్వీప్‌ పరాభవాన్ని కూడా తప్పించుకుంది. తొలి రెండు వన్డేల్లో గెలిచిన ఆతిథ్య ఆసీస్‌ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి వన్డేలో రోహిత్‌ శర్మ అద్భుతమైన శతకంతో భారత్‌ను గెలిపించాడు. అతనికి విరాట్‌ కోహ్లి సహకరించాడు.

కోహ్లి సరసన
ఇదే సిరీస్‌లో గిల్‌ కెప్టెన్‌గా ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. తొలి వన్డేతో ఈ ఫార్మాట్‌లో కెప్టెన్సీ అరంగేట్రం చేసిన గిల్‌.. ఆ మ్యాచ్‌లో ఓటమి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్‌ ఓడిన రెండో భారత కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి సరసన చేరాడు. 

గిల్‌ టీ20 కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓడాడు. టెస్ట్‌ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం ఎదుర్కొన్నాడు. తాజాగా వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ చేతిలో భంగపడ్డాడు.

మొత్తంగా గిల్‌కు భారత కెప్టెన్‌గా మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. తాత్కాలిక కెప్టెన్‌గా టీ20ల్లో తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. జింబాబ్వేతో జరిగిన ఆ సిరీస్‌ను భారత్‌ 4-1 తేడాతో గెలుచుకుంది.

టెస్ట్‌ల్లో భారత కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో​ ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి ఎదురైనప్పటికీ.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని, 5 మ్యాచ్‌ల ఆ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్నాడు.

తాజాగా ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించినప్పటికీ.. గెలుపుతో ముగించి వైట్‌వాష్‌ పరాభవం నుంచి తప్పించుకున్నాడు.

గిల్‌.. రేపటి నుంచి (అక్టోబర్‌ 29) సాధారణ ఆటగాడిగా ఆస్ట్రేలియాతో జరుగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ మ్యాచ్‌ కాన్‌బెర్రా వేదికగా భారతకాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది.

చదవండి: మరోసారి 'మరో ఛాన్స్‌' అంటున్న కరుణ్‌ నాయర్‌..!

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)