Breaking News

'మా నాన్న పాన్‌ షాప్‌ నడిపాడు.. ఐపీఎల్‌ డబ్బులతో ఇల్లు కొనాలనుకుంటున్నా'

Published on Thu, 12/28/2023 - 09:23

ఐపీఎల్‌-2024 వేలంలో విధర్భ ఆటగాడు శభమ్‌ దూబేపై కాసుల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో దూబేను రూ.5.60 కోట్ల భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. దేశీవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న 28 ఏళ్ల దూబే.. ఇప్పుడు క్యాష్‌రిచ్‌ లీగ్‌లోనూ సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. ఇక తాజాగా తన మనసులోని మాటను దూబే బయటపెట్టాడు. ఐపీఎల్‌లో వచ్చిన డబ్బులతో తన కుటుంబం కోసం కోసం ఇళ్లు కొంటానని దూబే తెలిపాడు. 

'మా కుటుంబం ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. క్రికెట్ కిట్ కొనే స్థోమత లేదు. కానీ మా నాన్న ఇప్పటికీ తన కష్టంతో నాకు క్రికెట్ కిట్‌ని కొని ఇస్తున్నారు. నేను ఈ స్థాయికి వచ్చానంటే అందుకు కారణం మా నాన్నే. ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ నన్ను వేరే పని చేయమని ఎప్పుడూ బలవంతం చేయలేదు.

మా నాన్న నిరాడంబరమైన వ్యక్తి. కుటంబాన్ని పోషించడానికి ఎంతో కష్టపడ్డారు. మొదటిలో పాన్ స్టాల్ నిర్వహించారు. ఆ తర్వాత హోటల్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. మా నాన్నతో పాటు నా సోదరుడు కూడా ఎంతో మద్దతుగా నిలిచాడు. నాపై ఎటువంటి ఒత్తడి కలగకుండా తన కూడా ఎదో ఒక పనిచేసి మా నాన్నకు సాయంగా ఉండేవాడు.

నేను గాయపడి క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయంలో కూడా నా కుటుంబం చాలా సపోర్ట్‌గా ఉంది. ఇకపై వారికి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకోవాలనకుంటున్నాను. నేను ముందుగా నా ఫ్యామిలీ కోసం ఇల్లు కొనాలనుకుంటున్నానని" రాజస్తాన్‌ రాయల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో​ దుబే పేర్కొన్నాడు.
చదవండి: IND vs AFG: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియా కొత్త కెప్టెన్‌ అతడే!? రోహిత్‌ డౌటే?

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)