Breaking News

ప్రో క‌బ‌డ్డీలో సంచ‌ల‌నం.. ఒకే రైడ్‌లో 7 పాయింట్లు! వీడియో వైర‌ల్‌

Published on Tue, 10/28/2025 - 17:48

ప్రోక‌బ‌డ్డీ లీగ్‌-2025లో సంచలనం నమోదైంది. సోమవారం రాత్రి ఢిల్లీ వేదికగా పట్నా పైరేట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌2లో బెంగళూరు బుల్స్ స్టార్ రైడర్ శుభం బిటాకే అద్బుతం​ చేశాడు. ఒకే రైడ్‌లో ఏడు పాయింట్లు సాధించి అందరిని షాక్‌కు గురిచేశాడు.

ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి పాట్నా పైరేట్స్ బెంగళూరు బుల్స్ పై 27-13 ఆధిక్యంలో నిలిచింది. దీంతో బెంగళూరుకు ఘోర ఓటమి తప్పదని అంతా భావించారు. కానీ శుభమ్ ఒక్క సంచలన రైడ్‌తో బెంగళూరును తిరిగి గేమ్‌లోకి తీసుకొచ్చాడు.

పాట్నా డిఫెండర్లను చాకచాక్యంగా బురిడీ కొట్టించిన  శుభమ్‌.. ఆరు టచ్ పాయింట్లు, ఒక్క బొనస్ పాయింట్ సాధించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కానీ ఆఖరిలో  రైడర్లు, డిఫెండర్లు చిన్న చిన్న తప్పిదాలు చేయడంతో బెంగళూరు 46-37 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

చరిత్ర సృష్టించిన శుభమ్‌..
అయితే ఈ మ్యాచ్‌లో సూపర్ రైడ్‌తో మెరిసిన శుభమ్.. ఓ అరుదైన రి​​కార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రోకబడ్డీ లీగ్ చరిత్రలో ఒకే రైడ్‌లో అత్యధిక వ్యక్తిగత పాయింట్లు సాధించిన ఆటగాడిగా బిటాకే నిలిచాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు ప‌ర్దీప్ న‌ర్వాల్ పేరిట ఉండేది. పీకేఎల్‌-2017లో ప‌ర్దీప్ ఒకే రైడ్‌లో 6 వ్య‌క్తిగ‌త పాయింట్లు తీసుకొచ్చాడు. వాస్త‌వానికి ఆ రైడ్‌లో ప‌ర్దీప్.. 8 పాయింట్లు సాధించాడు. కానీ అందులో 6 వ్య‌క్తిగ‌త పాయింట్లు కాగా.. మ‌రో రెండు ఆలౌట్ పాయింట్లు ఉన్నాయి. 
చదవండి: PKL 2025: తెలుగు టైటాన్స్‌కు చావో రేవో మ్యాచ్‌.. ఓడితే ప‌రిస్థితి ఏంటి?

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు