Breaking News

టెస్టు క్రికెట్‌లోకి తిరిగిరానున్న శ్రేయ‌స్ అయ్య‌ర్‌

Published on Fri, 08/01/2025 - 13:22

ఐపీఎల్‌-2025 సీజ‌న్ త‌ర్వాత విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా స్టార్ శ్రేయ‌స్ అయ్య‌ర్ తిరిగి మైదానంలో అడుగుపెట్ట‌నున్నాడు. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో అయ్య‌ర్ ఆడ‌నున్నాడు. దులీప్ ట్రోఫీలో ఆడేందుకు త‌ను సిద్దంగా ఉన్నానని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం.

ఈ దేశవాళీ రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీ ఆగ‌స్టు 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో అయ్య‌ర్ వెస్ట్‌జోన్ త‌ర‌పున ఆడ‌నున్నాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో పాటు టీమిండియా క్రికెట‌ర్లు స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబేలు కూడా దులీప్ ట్రోఫీలో ఆడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వెస్ట్‌జోన్ జ‌ట్టు ఇప్ప‌టికే సెమీఫైన‌ల్‌కు క్వాలిఫై అయింది. సెప్టెంబ‌ర్ 4 నుంచి ప్రారంభం కానున్న సెమీస్‌లో క్వార్ట‌ర్ ఫైన‌ల్ విజేతతో వెస్ట్‌జోన్ త‌ల‌ప‌డ‌నుంది.

ఇక ఇది ఇలా ఉండ‌గా.. వైట్‌బాల్ క్రికెట్‌లో త‌న‌ను త‌ను నిరూపించుకున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇంకా టెస్టుల్లో మాత్రం త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు. భార‌త త‌ర‌పున ఇప్ప‌టివ‌ర‌కు 14 టెస్టులు ఆడిన అయ్య‌ర్‌.. 36.86 స‌గ‌టుతో 811 ప‌రుగులు చేశాడు.

అయితే డిమాస్టిక్ క్రికెట్‌లో మాత్రం అయ్య‌ర్ దుమ్ములేపుతున్నాడు.  గ‌త రంజీ ట్రోఫీ సీజ‌న్‌లో కూడా ఈ ముంబైక‌ర్ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. దీంతో అత‌డిని ఇంగ్లండ్‌తో టెస్టుల‌కు ఎంపిక చేస్తార‌ని భావించారు. కానీ సెల‌క్ట‌ర్లు మాత్రం అత‌డిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. అతడికి ప్రస్తుతం జట్టులో

అయ్యర్‌ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి.. టెస్టు జట్టులో అతడికి ఛాన్స్‌ ఇచ్చేందుకు అవకాశం లేదని ఛీప్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ వెల్లడించాడు. అయితే ఇంకా మెరుగ్గా రాణించి టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా అయ్యర్‌ ముందుకువెళ్తున్నాడు. ఈ క్రమంలోనే దులీప్‌ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయ్యర్‌ భారత తరపున చివరగా గతేడాది ఫిబ్రవరిలో టెస్టు మ్యాచ్‌ ఆడాడు.
చదవండి: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. సూసైడ్ ఆలోచనలూ వచ్చాయి: చాహల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)