Breaking News

స‌న్‌గ్లాసెస్‌తో బ్యాటింగ్‌..! క‌ట్ చేస్తే డ‌కౌట‌య్యాడు(వీడియో)

Published on Fri, 09/13/2024 - 13:53

దులీప్ ట్రోఫీ-2024లో టీమిండియా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ త‌న స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోతున్నాడు. ఈ టోర్నీలో ఇండియా డి జ‌ట్టుకు సార‌థ్యం వ‌హిస్తున్న అయ్య‌ర్‌.. మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. ఇండియా-సితో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచ‌రీ సాధించి ట‌చ్‌లో క‌న్పించిన శ్రేయ‌స్‌.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో మాత్రం దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

అనంత‌పూర్ వేదిక‌గా ఇండియా-ఎతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అయ్య‌ర్ డ‌కౌట‌య్యాడు. 7 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై ఆట‌గాడు.. ఖాలీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో ఖాతా తెర‌వ‌కుండా పెవిలియ‌న్‌కు చేరాడు. ఓ చెత్త షాట్ ఆడి మిడాన్‌లో అయ్య‌ర్ దొరికిపోయాడు. 

ఈ మ్యాచ్‌లో అయ్య‌ర్ కూలింగ్ అద్దాలు పెట్టుకుని మ‌రి బ్యాటింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది.  ఈ టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన శ్రేయ‌స్ కేవ‌లం 63 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో టీమిండియా టెస్టు జ‌ట్టులోకి రీఎంట్రీ ఇవ్వాల‌న్న అయ్య‌ర్ క‌ల ఇప్ప‌టిలో నేర‌వేరేలా క‌న్పించ‌డం లేదు.

మ‌రోవైపు బీసీసీఐ అగ్రహానికి గురైన ఇషాన్ కిష‌న్ మాత్రం అద‌ర‌గొడుతున్నాడు. ఇండియా-సి జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కిష‌న్‌.. భార‌త్‌-బి జ‌ట్టుతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సెంచ‌రీతో మెరిశాడు. అంత‌కుముందు బుచ్చిబాబు టోర్నీలో సైతం కిష‌న్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.
చదవండి: AFG vs NZ: అత్యంత చెత్త రికార్డు.. 91 ఏళ్ల చరిత్రలో తొలిసారి?

 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)