కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్‌

Published on Sat, 07/11/2026 - 19:44

భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు సాధించాడు. భారత్‌ తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సార్లు (వరుసగా) టాస్‌ గెలిచిన కెప్టెన్‌గా ధోని రికార్డు సమం చేశాడు. శ్రేయస్‌, ధోని వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచారు. ఈ జాబితాలో శ్రేయస్‌, ధోని తర్వాతి స్థానాల్లో విరాట్‌ కోహ్లి (6), రోహిత్‌ శర్మ (5) ఉన్నారు.

ఇంగ్లండ్‌తో ఇవాళ (జులై 11) జరుగుతున్న ఐదో టీ20లో టాస్‌ గెలవడం ద్వారా శ్రేయస్‌ కోహ్లి రికార్డును అధిగమించి, ధోని రికార్డును సమం చేశాడు.

భారత టీ20 కెప్టెన్‌గా అత్యధిక వరుస టాస్ విజయాలు..
శ్రేయస్ అయ్యర్ – 7* (2026)
ఎంఎస్ ధోని – 7 (2010-12)
విరాట్ కోహ్లీ – 6 (2019)
ఎంఎస్ ధోని – 5 (2007)
రోహిత్ శర్మ – 5 (2020-22)

మళ్లీ టాస్‌ గెలిచిన శ్రేయస్‌.. ఆసారైనా మ్యాచ్‌ గెలిచేనా..?
భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ వరుసగా ఏడో మ్యాచ్‌లో టాస్‌ గెలిచాడు. అయితే ఈ ఏడు మ్యాచ్‌ల్లో అతడు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయాడు. ఐర్లాండ్‌ సిరీస్‌తో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయస్‌ ఆ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచి, సిరీస్‌ను మాత్రం 0-2తో కోల్పోయాడు. 

ఆతర్వాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనూ టాస్‌ గెలవగా.. ఆ మ్యాచ్‌ వర్షం​ కారణంగా రద్దైంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల్లోనూ శ్రేయస్‌ టాస్‌ గెలిచినా, ఒక్క మ్యాచ్‌లోనూ టీమిండియాను గెలిపించలేకపోయాడు.

దీంతో ఈసారైనా మ్యాచ్‌ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రేయస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ రెండు మార్పులు చేసింది. వైభవ్‌ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్‌.. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో సూర్యాంశ్‌ షేడ్గే జట్టులోకి వచ్చారు.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్

ల

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)