Breaking News

కరీబియన్‌ లీగ్‌ ఆడనున్న ఆర్సీబీ ఆల్‌రౌండర్‌.. తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు

Published on Sat, 07/01/2023 - 12:02

భారత అప్‌కమింగ్‌ మహిళా క్రికెటర్‌ శ్రేయాంక పాటిల్‌ అరుదైన ఘనత సాధించింది. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా (పురుషుల లేదా మహిళల క్రికెట్‌) రికార్డుల్లో నిలిచింది. ఇటీవల ముగిసిన మహిళల ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచిన శ్రేయాంక.. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడనప్పటికీ సీపీఎల్‌ ఆడే జాక్‌పాట్‌ కొట్టేసింది.

సీపీఎల్‌లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ ఫ్రాంచైజీ శ్రేయాంకతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, భారత పురుషుల క్రికెటర్ల తరహాలో మహిళా క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనడంపై ఎలాంటి అంక్షలు లేవు. గతంలో భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధన, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌, ఇంగ్లండ్‌ హండ్రెడ్‌ టోర్నీల్లో పాల్గొన్నారు. అయితే ఏ భారత క్రికెటర్‌ సీపీఎల్‌లో మాత్రం ఆడింది లేదు. తాజాగా శ్రేయాంకకు మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది. 

20 ఏళ్ల స్పిన్‌ అల్‌రౌండర్‌ అయిన శ్రేయాంక.. మహిళ ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది. అనంతరం జరిగిన ఏసీసీ మహిళల ఎమర్జింగ్‌ టీమ్స్‌ కప్‌లో సత్తా చాటి (ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌) లీగ్‌ క్రికెట్‌లో విదేశీ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శించింది. త్వరలో ప్రారంభంకానున్న సీపీఎల్‌లో శ్రేయాంక.. స్టెఫానీ టేలర్‌ నేతృత్వంలో గయానా ఆమెజాన్‌ వారియర్స్‌కు ఆడనుంది.

శ్రేయాంకతో పాటు ఆమె ఆర్సీబీ సహచరిణులైన సుజీ బేట్స్‌, సోఫీ డివైన్‌లను కూడా ఆమెజాన్‌ వారియర్స్‌ ఎంపిక చేసుకుంది. లెజెండరీ సౌతాఫ్రికా పేసర్‌ షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ కూడా ఆమెజాన్‌ వారియర్స్‌కు ఆడనుంది. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. ఆగస్ట్‌ 31న మొదలై సెప్టెంబర్‌ 10 వరకు సాగనుంది. ఈ లీగ్‌లో మొత్తం 3 జట్లు పాల్గొంటాయి. లీగ్‌ దశలో ఒక్కో జట్టు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)