Breaking News

గన్నవరం చేరుకున్న వరల్డ్‌కప్‌ విన్నర్‌ శ్రీచరణి..

Published on Fri, 11/07/2025 - 09:14

ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ 2025 గెలిచిన భారత జట్టు సభ్యురాలు, ఆంధ్ర క్రికెటర్ శ్రీచ‌ర‌ణి శుక్ర‌వారం ఉద‌యం గ‌న్న‌వరంకు చేరుకుంది. గ‌న్న‌వరం విమాన‌శ్రయంలో ఆమెకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు, మంత్రులు అనిత‌, సవిత,  రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని ఘ‌న‌స్వాగ‌తం పలికారు.

చ‌ర‌ణిని అభినందించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద‌కు వ‌చ్చారు.  శ్రీ చరణి గ‌న్నవరం నుండి ర్యాలీగా ఉండవల్లికి చేరుకోనుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌డు, మంత్రి లోకేష్‌ను చ‌ర‌ణి క‌ల‌వ‌నుంది. ఆ త‌ర్వాత  మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను చ‌ర‌ణి సంద‌ర్శించ‌నుంది.

కాగా భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు తొలి వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను సొంతం చేసుకోవ‌డంలో చ‌ర‌ణిది కీల‌క పాత్ర. టోర్నీ అసాంతం చ‌ర‌ణి అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. క‌డ‌ప జిల్లాకు చెందిన శ్రీచ‌ర‌ణి ఫైనల్ మ్యాచ్‌లోనూ బంతితో మ్యాజిక్ చేసింది. ఈ 50 ఓవర్ల ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రీ చరణి 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీసింది. దీప్తీ శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో చరణి నిలిచింది.
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)