నీరజ్‌ చోప్రా తల్లిపై షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు..

Published on Sun, 08/11/2024 - 13:45

భారత బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా తల్లి సరోజ్‌ దేవి తన మంచి మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. ప్యారిస్ ఒలింపిక్స్‌-2024లో తన కొడుకు బంగారు పతకాన్ని తృటిలో చేజార్చుకునప్పటకి ఆమె  మాత్రం ఏ మాత్రం దిగులు చెందలేదు.

పసిడి పతకం సొంతం చేసుకున్న పాకిస్తాన్ స్టార్ అథ్లెట్‌పై సరోజ్‌ దేవి  ప్రశంసల వర్షం కురిపించారు. అర్షద్‌ను కూడా తన కొడుకులాంటివాడని.. వారిద్దరు పోటీపడుతుంటే చూడముచ్చటగా ఉంటుందని ప్రేమను చాటుకున్నారు. 

ఈ క్రమంలో నీరజ్ తల్లి చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ మనసును హత్తుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆమె తల్లి ప్రేమని అక్తర్ కొనియాడాడు. " ఎవరో స్వర్ణం​ పతకం సాధిస్తే.. అతడు కూడా మా కుమారుడే అని ఆమె చెప్పారు. ఇలా చెప్పడం ఒక తల్లికి మాత్రమే సాధ్యం. నిజంగా ఇదొక అద్భుతమని" ఎక్స్‌లో అక్తర్ రాసుకొచ్చాడు. కాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా రజత పతకం సాధిం‍చాడు. 

జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను 89.45 మీటర్లు విసిరి రెండో స్ధానంలో నిలిచిన నీరజ్.. వరుసగా రెండో ఒలిపింక్ పతకాన్ని ముద్దాడాడు. అయితే అర్షద్ నదీమ్‌ బంగారు పతకాన్ని సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫైనల్లో ఏకంగా జావెలన్‌ రికార్డు స్ధాయిలో 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)