Breaking News

రోహిత్‌ 20 సిక్స్‌లు కొట్టేవాడు.. ఆ బౌలర్‌ బతికిపోయాడు: షోయబ్‌ అక్తర్‌

Published on Mon, 11/06/2023 - 17:15

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా టీమిండియా చేతిలో 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 327 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రోటీస్‌ కేవలం 83 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లలో స్పిన్నర్‌ రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగాడు. సఫారీలు ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో కూడా దారుణంగా విఫలమయ్యారు. మొదటి బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. కాగా ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ మాత్రం స్పిన్నర్లకు అద్బుతంగా అనుకూలించింది.

అయితే స్పిన్‌కు అనుకూలించిన వికెట్‌పై విఫలమైన ప్రోటీస్‌ స్పిన్నర్‌ తబ్రైజ్‌ షమ్సీపై పాక్‌ మాజీ స్పీడ్‌ స్టార్‌ షోయబ్‌ అక్తర్‌ విమర్శల వర్షం కురిపించాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ షమ్సీ బౌలింగ్‌ను ఆడి వుంటే కనీసం 20 సిక్స్‌లు కొట్టేవాడని అక్తర్‌ అన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో షమ్సీ తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 72 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

అంతేకాకుండా ఏకంగా 7 వైడ్‌లు వేశాడు. ఒక స్పిన్నర్‌ ఇన్నివైడ్‌లు వేయడం మనం అరుదుగా చూస్తూ ఉంటాం. ఇక అతడి తోటి స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ మాత్రం అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. మహారాజ్‌ తన కోటాలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

"రోహిత్‌ శర్మ అద్బుతమైన షాట్‌లు ఆడాడు. తబ్రైజ్ షమ్సీ చెత్త బౌలింగ్‌ వేశాడు. షమ్సీ రోహిత్‌కు అలాంటి బంతులను వేసి ఉంటే.. అతడు కనీసం 15 నుంచి 20 సిక్సర్లు కొట్టేవాడు. అప్పుడు భారత్‌ స్కోర్‌ బోర్డులో 430 పైగా పరుగులు వచ్చేవి.

ప్రతీ మ్యాచ్‌లోనూ రోహిత్‌ శర్మ నిస్వార్థ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. దూకుడుగా ఆడి జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తున్నాడని" తన యూట్యూబ్‌ ఛానల్‌లో అక్తర్‌ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కేవలం 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు.
చదవండిWC 2023: బంగ్లాదేశ్‌ అప్పీలు.. మాథ్యూస్‌ అవుట్‌! అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)