శివాలెత్తిన శివ‌మ్ దూబే.. రోహిత్ శ‌ర్మ రికార్డు సమం

Published on Thu, 01/29/2026 - 12:24

వైజాగ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన నాలుగో టీ20లో టీమిండియా ఓటమి పాలైన‌ప్ప‌టికి.. ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబే మాత్రం త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. 216 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో భార‌త జ‌ట్టుకు ఆరంభం నుంచే క‌ష్టాలు ఎదుర‌య్యాయి. మెన్ ఇన్ బ్లూ 60 ప‌రుగులకే 4 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది.

ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన శివ‌మ్ దూబే ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ఓవైపు క్ర‌మం త‌ప్పుకొండా వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి ఈ ముంబై స్టార్ మాత్రం త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌ను కొన‌సాగించాడు. భార‌త ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్ వేసిన స్పిన్న‌ర్ ఇష్ సోధీకి దూబే చుక్క‌లు చూపించాడు.

ఆ ఓవ‌ర్‌లో దూబే ఏకంగా 28 ప‌రుగులు పిండుకున్నాడు. తొలి బంతికి రెండు ప‌రుగులు తీసిన దూబే.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా 4,6,4,6,6 బాదాడు. ఈ క్ర‌మంలో ఒకే అత్య‌ధిక ప‌రుగులు సాధించిన మూడో భార‌త బ్యాట‌ర్‌గా రోహిత్ శ‌ర్మ రికార్డును దూబే స‌మం చేశాడు. ఈ జాబితాలో యువ‌రాజ్ సింగ్‌(36), సంజూ శాంస‌న్‌(30) తొలి రెండు స్ధానాల్లో ఉన్నాడు.

అయితే ఓ ద‌శ‌లో మ్యాచ్‌ను గెలిపించేలా క‌న్పించిన దూబే.. దుర‌దృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా కేవలం 23 బంతుల్లో మాత్రమే ఎదుర్కొన్న దూబే 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. దూబేతో పాటు రింకూ సింగ్‌(39) రాణించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో సొంతం చేసుకుంది.


 

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)