విధ్వంసం సృష్టించిన శిఖర్‌ ధవన్‌.. ఐపీఎల్‌కు ముందు ప్రత్యర్దులు హడల్‌

Published on Thu, 03/07/2024 - 14:35

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభానికి ముందు పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ ఫామ్‌లోకి వచ్చాడు. డీవై పాటిల్‌ టీ20 టోర్నీలో డీవై పాటిల్‌ బ్లూ జట్టుకు ఆడుతున్న గబ్బర్‌.. సీఏజీతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన శిఖర్‌ కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా డీవై పాటిల్‌ బ్లూ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గబ్బర్‌ తాజా  ప్రదర్శనతో ఐపీఎల్‌ జట్లు హడలిపోతున్నాయి. ధవన్‌ ఇదే భీకర్‌ ఫామ్‌ను కొనసాగిస్తే తిప్పలు తప్పవని మదనపడుతున్నాయి.

బ్లూ జట్టులో గబ్బర్‌ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. ఓపెనర్‌ అభిజిత్‌ తోమర్‌ (20 బంతుల్లో 31 పరుగులు), అయాజ్‌ ఖాన్‌ (9 బంతుల్లో 16), పరిక్షిత్‌ (6 బంతుల్లో 11 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సీఏజీ బౌలర్లలో సన్వీర్‌ సింగ్‌, రిత్విక్‌ చటర్జీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రధాన్‌, అంకిత్‌ శర్మ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఏజీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వరుణ్‌ లవండే (70) అర్దసెంచరీతో రాణించగా.. సన్వీర్‌ సింగ్‌ (48 నాటౌట్‌), ఆబిద్‌ ముస్తాక్‌ (17 నాటౌట్‌) సీఏజీని విజయతీరాలకు చేర్చారు. సీఏజీలో సంజయ్‌ 11, సేనాపతి 4, సచిన్‌ బేబీ 20 పరుగులు చేశారు. బ్లూ బౌలర్లలో విపుల్‌ కృష్ణన్‌ 2, కర్ష్ కొఠారి ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో సీఏజీ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇవాళే జరిగిన మరో క్వార్టర్‌ ఫైనల్లో ఇండియన్‌ అయిల్‌ జట్టు టాటా స్పోర్ట్స్‌ క్లబ్‌పై గెలుపొంది సెమీస్‌కు చేరింది. ఈ టోర్నీలో మరో రెండు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు ఇవాళే జరుగనున్నాయి.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)